Superstar Krishna Funerals Live Updates: కృష్ణ పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

15 Nov, 2022 11:47 IST|Sakshi

ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో బుధవారం మధ్యాహ్నాం  మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

రేపు ఉదయం 9 గంటలకు సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోస్‌కు తరలించనున్నారు. ఇవాళ రాత్రికి నానాక్‌రామ్‌గూడలోని ఆయన స్వగృహంలోనే ఉంచనున్నారు. 

కృష్ణ ఆత్మకు నివాళులర్పిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు చిత్ర పరిశ్రమ బంద్ పాటిస్తున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ‍ ప్రకటించింది. 

► సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహనికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'కృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు... ఆయనతో కలిసి 3 సినిమాల్లో నటించా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ సంతాపం ప్రకటించారు. 

సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి హీరో రానా, రెబల్ స్టార్‌ ప్రభాస్, యంగ్ హీరో అక్కినేని అఖిల్, టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు నివాళులర్పించారు. 

సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహనికి ఏపీ సీఎం జగన్‌ రేపు నివాళులర్పించనున్నారు.  బుధవారం హైదరాబాద్‌కు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. 

 కృష్ణ పార్థివదేహనికి సీనియర్ నటుడు మోహన్‌ బాబు నివాళులర్పించారు.  కృష్ణ పార్థివదేహాన్ని చూసిన మోహన్‌బాబు బోరున విలపించారు. బాధను ఆపులోలేక కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే మహేశ్‌ బాబును హత్తుకుని ఓదార్చారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. 
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

 ఒక మంచి మిత్రున్ని కోల్పోయానని సీఎం కేసీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు. ఈ బాధాకర సమయంలో ఆ కుటుంబానికి దేవుడు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని సీఎం ఆకాంక్షించారు. ఆయన వెంట మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్‌ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ కుడా ఉన్నారు. 

 కృష్ణ పార్థివదేహనికి సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. నానాక్‌రామ్‌గూడలోని కృష్ణ స్వగృహానికి చేరుకున్న కేసీఆర్‌ మహేశ్ బాబును పరామర్శించారు. కుటుంబసభ్యులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావు, ఎంపీ సంతోశ్ కుమార్ కూడా ఉన్నారు.

► సూపర్‌స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. బుధవారం సాయంత్రం 4గంటలకు మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. 

► కృష్ణ పార్థివదేహానికి మెగాస్టార్‌ చిరంజీవి ,ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌,  కల్యాణ్‌ రామ్‌, నాగచైతన్య తదితరులు నివాళులర్పించారు. . అనంతరం మహేష్‌ బాబు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తెలుగు సినీ దిగ్గజం కృష్ణ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’అని ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్‌ చేశాడు. 

సూపర్‌ స్టార్‌ కృష్ణ పార్థివదేహానికి హీరో వెంకటేశ్‌, దర్శఖులు బోయపాటి, రాఘవేంద్రరావుతో పాటు పలువురు సీనీ ప్రముఖులు నివాళులర్పించారు.దర్శకుడు రాఘవేంద్ర రావు పరామర్శిస్తున్న క్రమంలో మహేశ్‌ ద:ఖం ఆపుకోలేకపోయారు. తండ్రిని తలుచుకుని ఆయన కన్నీరు పెట్టుకున్న దృశ్యం అక్కడి వారితో పాటు అభిమానులను కలిచి వేస్తోంది.

► రేపు మహా ప్రస్థానం లో కృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు సిని రాజకీయ ప్రముఖుల సందర్శన తర్వాత కృష్ణ గారి పార్ధివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం 3గంటల నుంచి మహా ప్రస్థానానికి అంతిమ యాత్ర , సాయంత్రం 4గంటలకు మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. 

► సూపర్‌స్టార్‌ కృష్ణ మరణం పట్ల పశ్చిమగోదావరి జిల్లా వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణానికి సంతాపంగా మంగళవారం(నవంబర్‌ 15) జిల్లా వ్యాప్తంగా థియేటర్స్‌లో ఉదయం ఆటను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబీటర్స్‌ తెలిపారు. 

సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని హాస్పిటల్ నుంచి నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివదేహాన్ని ఉంచనున్నారు. రేపు పద్మాలయ స్టూడియో, అనంతరం కృష్ణ పార్థివ దేహానికి మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరుపబడతాయని తెలుస్తోంది. 

టాలీవుడ్ సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ(79) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్‌ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ కారణంగానే కృష్ణ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. కృష్ణ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు