Superstar Krishna: అభిమానిని తలుచుకొని ఎమోషనల్‌ అయిన సూపర్‌స్టార్‌ కృష్ణ

21 May, 2022 10:30 IST|Sakshi

బీఏ రాజుని స్మరించుకున్న సూపర్‌స్టార్‌ కృష్ణ

ప్రముఖ దివంగత నిర్మాత, పీఆర్‌ఓ బీఏ రాజు మొదటి వర్థంతి(మే21) సందర్భంగా సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆయనను స్మరించుకున్నాడు. బీఏ రాజు తన అభిమాని అని.. ఆయనను తాను మద్రాసు తీసుకెళ్లాలని గుర్తు చేసుకున్నారు. 

‘బీ ఏ రాజు నా అభిమాని. నేను బెజవాడ ఎప్పుడు వెళ్ళినా నన్ను కలిసేవాడు. ఫ్యాన్స్‌ మెయిల్ కి రిప్లై ఇవ్వడానికి నేనే అతన్ని మద్రాస్ తీసుకొచ్చాను. చాలా సంవత్సరాలు ఫ్యాన్ మెయిల్ కి రిప్లై ఇచ్చేవాడు. నాకు ఫ్యాన్స్ ని ఎక్కువగా డెవలప్ చేశాడు. ఆ తర్వాత నాకు జర్నలిస్ట్ అవ్వాలని ఉందండి, ఏదన్నా పేపర్ కు రెకమండ్ చేయండి అని అంటే నేనే జ్యోతిచిత్ర కు సిఫారసు చేశాను. తర్వాత రకరకాల పేపర్ లలో పని చేశాడు.

ఇండస్ట్రీలో అందరితో పరిచయాలు పెంచుకుని జర్నలిస్ట్ గా చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సొంతంగా సూపర్ హిట్ పత్రిక పెట్టి, ఆ పత్రికను తెలుగు సినిమా పత్రికల్లో నంబర్ వన్‌ పత్రికగా తీర్చిదిద్దాడు. అమెరికా లో కూడా పాపులర్ అయ్యేంతగా సూపర్ హిట్ పత్రికను  డెవలప్ చేశాడు . తర్వాత నిర్మాతగా సినిమాలు కూడా తీశాడు. చాలా అభివృద్ధి లోకి వచ్చి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇంత త్వరగా మనందరినీ విడిచి అతను వెళ్లిపోవడం చాలా బాధాకరం’ అని కృష్ణ అన్నారు.

మరిన్ని వార్తలు