దుబాయ్‌లో సిట్టింగ్‌ 

6 Dec, 2022 01:38 IST|Sakshi
మహేశ్‌బాబు 

మహేశ్‌బాబు–త్రివిక్రమ్‌–తమన్‌–నాగవంశీ... ఈ నలుగురూ దుబాయ్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఎందుకంటే ఈ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కోసం. మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నాగవంశీ నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌ ఒక షెడ్యూల్‌ పూర్తయింది.

త్వరలో రెండో షెడ్యూల్‌ స్టార్ట్‌ కానుంది. ఈ గ్యాప్‌లో దుబాయ్‌లో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ఆరంభించారు. ఓ వారం పది రోజుల పాటు పాటల పని జరుగుతుంది. అనంతరం హైదరాబాద్‌ చేరుకుని చిత్రీకరణ ఆరంభిస్తారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు