రజనీ ఆరోగ్యంపై మళ్లీ ఆందోళన.. ప్రత్యేక విమానంలో...

15 Jun, 2021 00:38 IST|Sakshi
రజనీకాంత్‌

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో పలు దేశాలు ఇతర దేశాల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే హీరో రజనీకాంత్‌ కోరిన మీదట అమెరికా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇంతకీ విషయం ఏంటంటే... రజనీ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లారని సమాచారం. ప్రత్యేక విమానంలో తన కుటుంబసభ్యులతో కలసి రజనీ వెళ్లారట. ఈ విమానంలో పద్నాలుగు మంది వరకూ ప్రయాణించవచ్చట. కాగా, ఇప్పటికే హాలీవుడ్‌ చిత్రం ‘ది గ్రే మ్యాన్‌’ నిమిత్తం అమెరికాలో ఉన్నారు రజనీ అల్లుడు, హీరో ధనుష్‌. అలాగే ధనుష్‌ భార్య ఐశ్వర్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారట. కాగా, రజనీ అమెరికా వెళ్లారనే వార్త వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు