చెన్నై చేరుకున్న ర‌జ‌నీకాంత్.. వీడియో వైరల్‌

12 May, 2021 17:40 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా, శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజాగా చిత్రం ‘అన్నాత్తే’. 2019లో ఈ చిత్రం షూటింగ్‌ మొదలైంది. కరోనా, రజనీకాంత్‌ అనారోగ్యం కారణంగా ఈ మూవీ షూటింగ్‌ నత్తనడకన సాగుతోంది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో షూటింగ్ ప్రారంభించిన‌ప్పుడు సెట్‌లో కొంద‌రికి క‌రోనా రావ‌డంతో పాటు ర‌జ‌నీకాంత్ కూడా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో షూటింగ్‌ను కొన్ని నెల‌ల పాటు వాయిదా వేశారు.

ఇక నెల రోజుల క్రితం క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ హైదరాబాద్‌లో షూటింగ్‌ని తిరిగి మొద‌లు పెట్టారు. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కూడా రజనీకాంత్ రిస్క్ చేసి మరీ  అన్నాత్తే చిత్రం కోసం 35 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గోన్నారు. తాజాగా ర‌జనీ పార్ట్ పూర్తి కావ‌డంతో ఆయ‌న ప్ర‌త్యేక విమానంలో బేగంపేట విమాన‌శ్ర‌యం నుంచి చెన్నైకి వెళ్లారు. ఇంటికి వచ్చిన రజనీకి ఆయన భార్య హారతి ఇచ్చి మరీ స్వాగతం పలికింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు