కేరళ పిటిషన్‌ను తొసిపుచ్చిన సుప్రీంకోర్టు

16 Dec, 2020 21:06 IST|Sakshi

తిరువనంతపురం: మలయాళ నటుడు దిలీప్ కుమార్‌‌తో పాటు మరి కొంతమంది లైంగిక వేధింపులు, అపహరణ కేసుల విచారణను బదిలీ చేయాలని కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. జస్టీస్‌ ఏఎం నేతృత్వంలోని ఖాన్విల్కర్‌ ధర్మాసనం ట్రయల్‌ జడ్జిపై పక్షపాత ఆరోపణలు చేయడం అనవసరమని కేరళ హైకోర్టుతో అంగీకరించారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది జి ప్రకాష్ ‘బాధితురాలిపై ప్రాసిక్యూషన్‌, పక్షపాత సంఘటనల కారణంగా ఈ కేసు విచారణ దెబ్బతిందని, న్యాయమైన విచారణ పొందడం బాధితురాలి హక్కు’ అని ఆయన ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘విచారణ నేపథ్యంలో బాధితురాలిని పరీక్షించే సమయంలో ఈ కేసులో 5వ నిందితుడు తన ఫోన్‌లో కోర్టు హాల్‌ చిత్రాలను తీశాడు. అదే విధంగా బాధితురాలైన సదరు మహిళ కోర్టుకు వస్తున్న కారు ఫొటోలు కూడా తీశాడు. అయితే ప్రాసిక్యూషన్‌ వారు ఈ అంశాలను ట్రయల్‌ కోర్టు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ట్రయల్‌ కోర్టు ఈ విషయంలో మౌనం వహించింది. దీనిని భారత ఆధారాల చట్ట ఉల్లంఘనగా నిర్వహించబడుతోందని’ రాష్ట్ర ప్రభుత్వం తన పటిషన్‌లో సుప్రీంకు నొక్కి చెప్పింది.

అంతేగాక ఈ కేసు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసేందుకు 40 మంది డిఫెన్స్‌ న్యాయదులు హాజరయ్యారని ప్రభుత్వం తెలిపింది. కోర్టు హాల్‌లో పెద్ద సంఖ్యలో న్యాయవాదులను అనుమతించిన కారణంగా బాధితురాలిని ప్రశ్నించడంలో నైతిక స్వభాన్ని ప్రశ్నించినప్పటికి లైంగిక వేధింపుల వివరాలపై ప్రశ్నించకుండా విచారణను అడ్డుకోవడంలో ట్రయల్‌ కోర్టు న్యాయమూర్తి విఫలమ్యారని ప్రభుత్వం పేర్కొంది. చెప్పాలంటే ఒక దశలో ట్రయల్‌ జడ్జి స్పష్టమైన కారణం లేకుండానే ఆందోళన చేందారని, స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా అనవసర వ్యాఖ్యలు చేసినట్లు రాష్ట్ర ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎర్నాకుళంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణను వెంటనే నిలిపివేయాలని రాష్ట్రం సుప్రీంకోర్టును కోరింది. అయితే ఈ కేసులో బాధితురాలైన మహిళ కారులో కొచ్చి వెళ్తుండగా ఆమెను బంధించి నటుడు దిలీప్‌తో పాటు కొంతమంది వ్యక్తులు ఆమెపై లైంగిక వేధింపులకు తెగబడినట్లు కేరళ పోలీసులు తెలిపారు. అంతేగాక ఈ ఘటన సమయంలో నిందితులు ఘటనకు సంబంధించి తమ ఫోన్‌లో వీడియోలు, ఫొటోలు కూడా తీశారని, ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా నటుడు దీలిప్‌ను బాధితురాలు ఆరోపించడంతో అరెస్టు చేసినట్లు కేరళ పోలీసులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు