డ్రగ్స్‌ కేసులో సినీ నటి ద్వివేదికి బెయిల్

21 Jan, 2021 14:39 IST|Sakshi

బెంగళూరు: గతేడాది కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన సినీ నటి రాగిణి ద్వివేదికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలున్నాయని, చిత్రపరిశ్రమలో చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే కారణంతో గత సెప్టెంబర్‌లో రాగిణి, సంజనాలను బెంగళూరు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో ద్వివేది, ఇతరులకు బెయిల్ ఇవ్వడానికి నవంబర్ 3న కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి తనను ఈ కేసులో తనను ఇరికించారని పిటిషన్ లో పేర్కొంది. నేడు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె పరప్పన అగ్రహార కేంద్ర జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంది.( చదవండి: మిషన్‌ ఫ్రంట్‌లైన్‌.. ఆర్మీలో రానా)
    
 

మరిన్ని వార్తలు