ఫ్యాంటసీ థ్రిల్లర్‌ అండ్‌ కామెడీగా ‘సురాపానం’

19 May, 2022 10:34 IST|Sakshi

ప్రగ్యా నయన్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సురాపానం’ (కిక్‌–ఫన్‌). సంపత్‌ కుమార్‌ దర్శకత్వం వహించి, లీడ్‌ రోల్‌ చేశారు. మట్ట మధు యాదవ్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్‌ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

‘‘ఫ్యాంటసీ థ్రిల్లర్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. తాను చేసిన ఒక పొరపాటు వల్ల జరిగిన పరిణామాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనే కథాంశాన్ని థ్రిల్లింగ్‌గా చూపిస్తూ హాస్యాన్ని జోడించి ఈ చిత్రం తీశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. అజయ్‌ ఘోష్, సూర్య, ఫిష్‌ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్‌ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సెసిరోలియో, కెమెరా: విజయ్‌ ఠాగూర్‌.

మరిన్ని వార్తలు