కూతురి చేష్టలపై సురేఖ వాణి కామెంట్స్‌, నెటిజన్ల కౌంటర్‌!

12 Jun, 2021 20:20 IST|Sakshi

క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో తన సెకండ్ మ్యారెజ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగినప్పటి నుంచి ఆమె ఏదోక రకంగా ట్రోల్స్‌ బారిన పడుతోంది. దీనితో పాటు తన కూతురు సుప్రితతో కలిసి సోషల్‌ మీడియాలో ఆమె చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోట్టి దుస్తులు ధరించి కూతురితో పోటీగా చిందులేసి విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమాల్లో సాంప్రదాయంగా చీరలో కనిపించే సురేఖను ఇలా చూసిన నెటిజన్లంత ఆమెపై అసహనం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా ఆమె కూతురు సుప్రిత సైతం తన పోస్టులతో ట్రోల్స్‌ బారిన పడటం, నెటిజన్లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి ఈ తల్లికూతుళ్లు వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సురేఖ తన కూతురిపై కౌంటర్‌ వేసింది. సుప్రిత తమ పెంపుడు కుక్కతో సరదాగా ఆడుకుంటున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఏంటో ఈ పిచ్చి చేష్టలు’ అంటూ సురేఖ పోస్టు షేర్‌ చేసింది. అది చూసిన నెటిజన్లు ఆ వేశాలు మీ ఇద్దరికే తెలియాలి అంటూ తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చదవండి: 
కాబోయేవాడు అలా ఉండాలి, అప్పుడే పెళ్లి : సురేఖవాణి కూతురు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు