రేవంత్‌ రెడ్డి ఫోటో షేర్‌ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత

5 Dec, 2023 09:20 IST|Sakshi

టాలీవుడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్‌ మీడియాలో చాలా ఫాలోయింగ్‌ ఉంది. సురేఖ వాణి గతంలో చాలా సినిమాలలో నటించి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన కూతురు సుప్రితను కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉంచాలనే ప్రయత్నం ఆమె చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తన కూతురితో కలిసి రీల్స్ చేస్తూ ఆ రీల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు సురేఖ.

అలాగే తన కూతురు సుప్రిత కూడా ఫోటోలతో పాటు రీల్స్‌ కూడా షేర్‌ చేస్తుంటారు. అవన్నీ నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. ఒక్కోసారి కొందరు అదే పనిగా వారిని ట్రోల్‌ చేస్తూ ఇబ్బందులకు గురిచేయడం కూడా చాలాసార్లు జరిగింది. కానీ అలాంటి వాటిని వారు పట్టించుకోకుండా వదిలేశారు. ఒక్కోసారి ఆ ట్రోల్స్‌ వారిని మరింత ఇబ్బందలకు గురి చేస్తుంటాయి. వారిని భాదిస్తాయి కూడా అప్పుడు వారు రియాక్ట్‌ కావాల్సి వస్తుంది.

తాజాగా ఇలాంటి ట్రోల్స్‌పై సుప్రిత రియాక్షన్‌ ఇచ్చింది.  తెలంగాణలో జరిగిన ఎలక్షన్ ఫలితాలలో కాంగ్రెస్ గెలవడంతో రేవంత్ రెడ్డిని వారు అభినందించారు. గతంలో ఆయనతో దిగిన ఫోటోను షోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఇప్పుడు వారిద్దరిపై పలువురు నెటిజన్లు తప్పుగా కామెంట్లు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎన్నికలకు ముందు సురేఖ వాణి, సుప్రిత ఇద్దరూ బీఆర్ఎస్ గెలవాలని పలు రీల్స్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. కానీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. దీంతో ఆ రీల్స్‌ను సుప్రిత తొలగించింది. ఆపై రేవంత్‌ రెడ్డితో దిగిన ఫోటోను ఆమె షేర్‌ చేసింది. దీంతో నెటిజన్లు వారిపై భారీగా ట్రోల్‌ చేస్తున్నారు. మరికొందరైతే బూతులతో ఎదురుదాడి చేస్తున్నారు. 

ఈ విషయంపై సురేఖ కూతురు సుప్రిత రియాక్ట్‌ అయింది. 'రాజకీయ వివాదంలో నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను తొలుత బీఆర్ఎస్‌కు సపోర్టు చేశాను. అందులో తప్పేముంది. అదేవిధంగా  గెలిచిన వ్యక్తి రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పా. ఇంత మాత్రానికే నన్ను ట్రోల్ చేయడం ఏంటి..? నేను మీకేం అన్యాయం చేశాను. నాపై ఎందుకింత ద్వేషం పెంచుకున్నారు. మీరు చేస్తున్న ట్రోలింగ్ వల్ల నా మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి.' అని సుప్రీత పోస్ట్ చేసింది.

అందంతో అట్రాక్ట్‌ చేస్తున్న సురేఖ కూతురు సుప్రిత (ఫొటోలు)

తెలంగాణలో ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం చాలా మంది సినీ సెలబ్రటీలు, సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ ఇలా రిల్స్‌ చేస్తూ ప్రచారం చేశారు. శివ జ్యోతి, అషు రెడ్డిలతో పాటు చాలామంది బుల్లితెర తారలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు హైదరాబాద్‌ అభివృద్ధి గురించి చెబుతూ పలు వీడియోలు తీశారు. వారందరూ ఇండస్ట్రీకి చెందిన వారు కాబట్టి పెయిడ్‌ ప్రమోషన్‌ కూడా ఉండవచ్చు లేదా కాకపోవచ్చు. ఇవన్నీ గమనించని నెటిజన్లు వారిని ట్రోల్‌ చేస్తుండటంతో ఇబ్బందలకు గురౌతున్నారు.

>
మరిన్ని వార్తలు