భార్గవ్‌ కేసు: చేతులెత్తి దండం పెట్టిన సురేఖావాణి కూతురు

22 Apr, 2021 12:31 IST|Sakshi

ఈ అఘాయిత్యంపై ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదంటున్న సురేఖావాణి కూతురు

టిక్‌టాక్‌ స్టార్‌ భార్గవ్‌ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఫన్‌ వీడియోలతో ఫేమస్‌ అయిన భార్గవ్‌ అవకాశాలిప్పిస్తానంటూ మైనర్‌ బాలికను అత్యాచారం చేయడంతో అతడిని కటకటాల్లోకి నెట్టారు. తాజాగా ఈ ఘటనపై సురేఖావాణి కూతురు సుప్రిత స్పందించింది. అతడికి సంబంధించిన వార్తను షేర్‌ చేసింది. "భార్గవ్‌.. టిక్‌టాక్‌ వీడియోలో చూసిన 14 ఏళ్ల బాలికను ఇతర చానళ్లలో అవకాశం ఇప్పిస్తానని నమ్మించాడు. ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్‌ చేశాడు. అమ్మాయి నో చెప్పినా కూడా వీడియోల పేరుతో దగ్గరయ్యాడు. డ్రెస్‌ చేంజ్‌ చేసుకున్న వీడియోలు నా దగ్గర ఉన్నాయంటూ ఆమెను లోబర్చుకున్నాడు" అని పోలీస్‌ అధికారి చెప్పిన మాటలు విని ఆమె షాకైంది.

దీని గురించి స్పందించేందుకు మాటలు రావడం లేదు అంది. అతడు చేసిన అకృత్యం గురించి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని, చేతులెత్తి దండం పెడుతున్న ఎమోజీలను షేర్‌ చేసింది సుప్రిత. కాగా భార్గవ్‌ మాజీ ప్రేయసి, స్నేహితులు సైతం అతడు మంచివాడు కాదంటూ ఆరోపణలు చేస్తున్నారు. అతడు పెద్ద స్త్రీ లోలుడు అని, అమ్మాయిలను వీడియోల కోసం వాడుకునేవాడని పేర్కొన్నారు. కెమెరా ఆన్‌లో ఉన్నప్పుడు ఒకలా, ఆఫ్‌లో ఉన్నప్పుడు మరోలా ఉంటాడని విమర్శలు గుప్పించారు.

చదవండి: భార్గవ్‌ బాధితుల్లో ఒకరికి భర్త కూడా ఉన్నాడు

ఆ ఫోటోలతో బ్లాక్‌ మెయిల్‌.. భార్గవ్‌ నిజస్వరూపం బట్టబయలు‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు