ప్రతి అమ్మాయికి అలాంటి వాడు ఉండాలి: నెటిజన్‌ ప్రశ్నకి సుప్రిత కౌంటర్‌

18 Jan, 2022 10:51 IST|Sakshi

క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రితకు సోషల్‌ మీడియాలో ఎంత ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లితో  కలిసి సోషల్‌ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు.  పొట్టి దుస్తుల్లో ఉన్న తల్లి కూతుళ్ల ఫోటోలు వైరల్‌ అయి, చివరకు ట్రోల్‌ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా  సోషల్‌ మీడియాలో మరింత యాక్టీవ్‌గా ఉంటుంది సుప్రిత. తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులతో కలిసి చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్‌ గురించి అడిగిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే  కౌంటరిచ్చింది.

A post shared by BANDARU SUPRITHA NAIDU✨ (@_supritha_9)

 సుప్రిత ఫ్రెండ్స్ గ్యాంగ్‏లో అమ్మాయిలు, అబ్బాయిలుంటారు. ఇక ఈ విషయంపై ఓ నెటిజన్ నందు నీకేం అవుతాడు. బాయ్ ఫ్రెండా.. ? బాయ్ లో బెస్టీనా? అని అడిగారు. దానికి సుప్రీత స్పందిస్తూ.. ‘అవును.. ప్రతి అమ్మాయికి అలాంటి ఒక స్నేహితుడు ఉండాలి. ఒక అబ్బాయి.. అమ్మాయి స్నేహితులుగా ఉండలేరని అందరూ అనుకుంటారు.కానీ.. మేం స్నేహితులుగా ఉన్నాం. ఎవరేం అనుకున్నా సరే.. ఎప్పటికి మేం బెస్ట్ ఫ్రెండ్స్’అని చెప్పుకొచ్చింది. 

మరిన్ని వార్తలు