ఆ ఘనత మాదే, ఈ అవసరాన్ని గుర్తించాం: సురేష్‌ బాబు

25 Jun, 2021 07:42 IST|Sakshi

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎస్పీ మ్యూజిక్‌ అనే కొత్త మ్యాజిక్‌ లేబుల్‌ను ప్రారంభించారు. నిర్మాత సురేష్‌ బాబు మాట్లాడుతూ.. "1964లో మా నాన్న రామానాయుడుగారు స్థాపించిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ 50 ఏళ్లకు పైగా భారతదేశపు పెద్ద చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది"

"అత్యధిక భారతీయ భాషల్లో సినిమాలు తీసిన ఘనత మాదే. సంగీతం సినిమాలకు హృదయం లాంటది. దాన్ని సొంతంగా సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం. సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్న ఎస్పీ మ్యూజిక్‌ లేబుల్‌ మంచి సంగీతాన్ని అందించడానికి వేదికగా ఉపయోగపడంతో పాటు సంగీత శక్తి కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అన్నారు.

చదవండి: వ్యాక్సిన్‌ పేరుతో సురేష్‌బాబుకు టోకరా.. నిందితుడు అరెస్ట్‌

మరిన్ని వార్తలు