Suresh Kondeti: నా వల్ల ఇబ్బంది పడి ఉంటే క్షమించండి: సురేశ్ కొండేటి

4 Dec, 2023 19:05 IST|Sakshi

గోవాలో జరిగిన సంతోషం అవార్డ్స్‌ టాలీవుడ్‌ ఇండస్ట్రీలో వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని గత 21 ఏళ్లుగా ఇస్తున్న సినీ జర్నలిస్ట్ సురేశ్ కొండేటి స్పందించారు. ఈ అవార్డులు పూర్తిగా తన వ్యక్తిగతమని.. తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదంటూ ట్వీట్ చేశారు. 

సురేశ్ కొండేటి ట్వీట్‌లో రాస్తూ..' అందరికీ నమస్కారం .. గత 21 సం. గా  నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను . ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు . ప్రతి సంవత్సరం చాలా  కష్టపడి నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా  అవార్డ్స్ ఇస్తున్నా. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే . అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నా. గోవా ఈవెంట్‌లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్‌కు  రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్‌లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్. ఇది ఉదేశ్య పూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను. నా మీద కావాలనే కొంత మంది కావాలని బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ సురేష్ కొండేటి' అంటూ ట్వీట్ చేశారు. 

>
మరిన్ని వార్తలు