హీరో కానున్న హోటల్‌ నిర్వాహకుడు.. ఏకంగా పాన్‌ ఇండియా మూవీ

6 Mar, 2023 09:14 IST|Sakshi

తమిళ సినిమా: ప్రతిభను వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయని మరోసారి రుజువైంది. ఎక్కడో ఢిల్లీలో ఓ హోటల్‌ను నిర్వహిస్తున్న సురేష్‌ కుమార్‌ అనే తమిళ యువకుడిని సినిమాలో హీరోగా నటించే అవకాశం వరింంది. ఈయన ఎన్నం అళగానాల్‌ ఎల్లామ్‌ అళగాగుం అనే పాన్‌ ఇండియా చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ శరవణ భవ మూవీస్‌ పతాకంపై ఎస్పీ రామమూర్తి నాలుగు భాషల్లో నిర్మించనున్నారు.

రాజా పాండురంగన్‌ ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు పయనంగళ్‌ తొడరుమ్‌ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. నటుడు అరుళ్‌ దాస్, నటి షకీలా, ముల్‌లై కోదండం, మారన్, సురేష్‌ కుమార్, సతీష్‌ కుమార్, స్వాతి, అలీషా తదితరులు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. ఓ క్లిష్టమైన సమస్యలో చిక్కుకున్న కథానాయక కుటుంబాన్ని కాపాడడానికి వెళ్లిన నలుగురు యువకులు కూడా ఆ సమస్యలో ఇరుక్కుంటారన్నారు. అందులోం వారు ఎలా బయటపడ్డారు అన్నదే చిత్రకథ అని చెప్పారు.

చిత్ర షూటింగ్‌ లోకేషన్‌ ఎంపిక కోసం తాను నిర్మాత ఢిల్లీకి వెళ్లామని అక్కడ ఒక హోటల్లో భోజనం చేస్తుండగా ఆ హోటల్‌ నిర్వాహకుడు సురేష్‌ కుమార్‌ చలాకిగా వచ్చిన కస్టమర్లతో ప్రవర్తించే తీరు ఆకట్టుకోవడంతో తనను హీరో పాత్రకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. త్వరలో ప్రారంభించనున్న ఈ చిత్రం షటింగ్‌ను వేలర్, కాట్పాడి, చిత్తూరు, మైసర్, ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి కిరణ్‌ రాజ్‌ సంగీతాన్ని, రమేష్‌ చాయాగ్రహణం అందించనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు