Suriya 40 : ఫ్యాన్స్‌కు పండుగే.. అదిరిపోయిన ఫస్ట్‌లుక్‌

22 Jul, 2021 18:42 IST|Sakshi

హీరో సూర్య పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సూర్య కెరీర్‌లో 40వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను అనౌన్స్‌ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా సూర్య పుట్టినరోజు (జులై 23)కు ఒకరోజు ముందుగానే సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

సూర్య 40 ఫస్ట్‌లుక్‌ను మూవీ టీం రిలీజ్‌ చేసింది. అభిమానుల అంచనాలకు తగ్టట్లుగానే ఢిపరెంట్‌ గెటప్‌లో సూర్య కనిపించడంతో ఆయన ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాతో మరో హిట్టు ఖాయమని జోస్యం చెబుతున్నారు. కాగా ప్రస్తుతం సూర్య ఈ చిత్రంతో పాటు  వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘వాడివాసల్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో మరో సినిమాకు ఆయన సైన్‌ చేశారు. 

మరిన్ని వార్తలు