Oscar 2023: ఆస్కార్‌ నుంచి సూర్య, కాజోల్‌కు ఆహ్వానం..

29 Jun, 2022 14:20 IST|Sakshi

ప్రపంచ చలన చిత్ర రంగంలోని ఏ నటుడైన ప్రతిష్టాత్మకంగా భావిచే అవార్డు ఆస్కార్‌. జీవితంలో ఒక్కసారైన ఈ అవార్డు రావాలని కోరుకుంటారు. అలాగే ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనే అవకాశం వచ్చిన చాలనుకుంటారు. ఈ అరుదైన అవకాశం తాజాగా స్టార్‌ హీరో సూర్య, బాలీవుడ్ నటి కాజోల్‌కు దక్కింది. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యుడు, సభ్యురాలిగా వీరిద్దరు ఛాన్స్‌ కొట్టేశారు. 

ఈ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు వరల్డ్‌వైడ్‌గా 397 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో సూర్య, కాజోల్‌తోపాటు గతేడాది బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న రైటింగ్‌ విత్‌ ఫైర్‌ దర్శకులు సుస్మిత్‌ ఘోష్, రింటూ థామస్‌, ఇతర కళాకారులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఈ విషయాన్ని జూన్‌ 28న రాత్రి అకాడమీ బోర్డ్‌ ప్రకటించింది. 2022లో 44 శాతం మంది మహిళలు, 37 శాతం తక్కువ ప్రాతినిధ్యం ఉన్న జాతులకు చెందిన వారిని, 50 శాతం యూఎస్‌ఏకు వెలుపల 53 దేశాలు, భూభాగాలకు చెందిన వారిని తీసుకుంటున్నట్లుగా అకాడమీ తెలిపింది. 

చదవండి: గుండెముక్కలైంది.. టాలీవుడ్‌ ప్రముఖుల సంతాపం

కాగా సౌత్ ఇండియాతోపాటు కోలీవుడ్‌ నుంచి ఇలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నటుడిగా సూర్య గుర్తింపు పొందారు. సూర్య నటించిన 'జై భీమ్‌', 'ఆకాశం నీ హద్దురా' చిత్రాలు గతంలో ఆస్కార్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంలో అవార్డును అందుకోలేకపోయాయి. 

చదవండి: మరోసారి తండ్రి అయిన నిర్మాత దిల్‌ రాజు..

మరిన్ని వార్తలు