అమెజాన్‌ ప్రైమ్‌లో సూర్య జై భీమ్‌, స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

1 Oct, 2021 21:44 IST|Sakshi

తమిళ హీరో సూర్యకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్‌ ఉంది. అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్‌ అవుతూ వస్తున్నాయి. ఇటీవల ఆయన నటించిన 'సూరరై పోట్రు' తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో రిలీజై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదలైన విషయం తెలిసిందే! 

తాజాగా సూర్య నటించిన మరో చిత్రం 'జై భీమ్‌' కూడా ఓటీటీలోనే రిలీజ్‌ అవుతోంది. ఇందులో సూర్య లాయర్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్‌ 2 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ఈమేరకు ప్రైమ్‌ వీడియో అధికారికంగా ప్రకటన వెలువడించింది. కాగా జై భీమ్‌ చిత్రానికి టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించాడు. ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, లిజొమోల్‌ జోస్‌, రాజీశ విజయన్‌, మణికందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు.

A post shared by amazon prime video IN (@primevideoin)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు