ప్రపంచ రికార్డు సాధించిన ఆకాశమే నీ హద్దురా

20 May, 2021 08:27 IST|Sakshi

సూరరై పోట్రుకు అరుదైన గౌరవం

సూర్య కథానాయకుడిగా చేసిన 'సూరరై పోట్రు' చిత్రం మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రపంచ సినిమాల్లోనే మూడో స్థానంలో నిలిచింది. మహిళా దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'సూరరై పోట్రు'. డెక్కన్‌ ఎయిర్‌ సంస్థ అధినేత గోపీనాథ్‌ బయోపిక్‌తో రూపొందిన ఈ సినిమా ప్రారంభం నుంచి రికార్డులను సొంతం చేసుకుంటూనే ఉంది. ఓటీటీలో విడుదలైన ఐదుగురు ప్రముఖ హీరోల చిత్రాల్లో ఇదే తొలి చిత్రంగా నమోదైంది. అదే విధంగా అమెజాన్‌ ప్రైమ్‌ టైంలో అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన చిత్రంగా రికార్డు కెక్కింది.

ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల పోటీల బరిలో ఉత్తమ చిత్రం కేటగిరిలో, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ కథానాయకి కేటగిరిల్లో నామినేషన్లో ఢీ కొట్టే వరకు వెళ్లింది. అదే విధంగా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడిన 'సూరరై పోట్రు' షాంఘాయ్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ దర్శకురాలిగా సుధా కొంగర, ఉత్తమ కథానాయకుడిగా సూర్య, ఉత్తమ కథానాయకిగా అపర్ణ బాలమురళికి  అవార్డులను తెచ్చిపెట్టింది.

తాజాగా మరో అరుదైన రికార్డు సూరరై పోట్రు సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్‌ సాధించిన 1000 చిత్రాల్లో సూరరై పోట్రు మూడో స్థానంలో నిలిచింది. ఐఎమ్‌డీబీ అనే ప్రముఖ వెబ్‌సైట్‌ చేసిన సర్వేలో 9.3 రేటింగ్‌ సాధించి మొదటిస్థానంలో ది షషాంక్‌ రెడెంప్షన్‌ చిత్రం, 9.2 రేటింగ్‌తో ది గాడ్‌ ఫాదర్‌ చిత్రం రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా, 9.1 రేటింగ్‌ సాధించి సూరరై పోట్రు చిత్రం మూడో స్థానంలో నిలిచి అరుదైన రికార్డును సాధించింది.

చదవండి: ‘రాధే’ పైరసీ: ముగ్గురు సోషల్‌ మీడియా యూజర్లపై కేసు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు