Jai Bhim Trailer: వాళ్ల కోసం ఫైట్‌ చేస్తానంటున్న లాయర్‌ సూర్య

22 Oct, 2021 21:41 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు తమిళనాట మాత్రమే కాకుండా తెలుగులోనూ విపరీతమైన క్రేజ్‌ ఉంది. అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్‌ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో గతేడాది వచ్చిన 'ఆకాశం నీ హద్దురా' చిత్రం ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.

తాజాగా సూర్య నటించిన మరో చిత్రం 'జై భీమ్‌' కూడా ఓటీటీ బాట పట్టింది. టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య లాయర్‌ పాత్ర పోషిస్తున్నాడు. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. 'పోరాడుదాం పోరాడుదాం.. న్యాయం జరిగేవరకు పోరాడుదాం' అన్న నినాదాలతో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. అమాయక గిరిజనుల కోసం పోరాడుతున్న లాయర్‌గా సూర్య అదరగొట్టాడు. నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. 'జై భీమ్‌' నవంబర్‌ 2 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, లిజొమోల్‌ జోస్‌, రాజీశ విజయన్‌, మణికందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు.

మరిన్ని వార్తలు