తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్య42’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. సిరుత్తే శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా దాదాపు పది భాషల్లో, 2D అండ్ 3D ఫార్మాట్స్‌లో విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సూర్య 42 మూవీకి సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘కంగువ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి మరియు అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం.
ఈ సినిమా షూటింగ్ గోవా, చెన్నైతో పాటు పలు లొకేషన్లలో జరుగుతోంది. ఇప్పటికే 50 శాతం పూర్తయ్యింది. సూర్య చాల గంభీరంగా తెరపై కనిపిస్తాడు. ఇది మాకు గుర్తుండిపోయే, ప్రత్యేకమైనది. త్వరలోనే షూటింగ్‌ను కంప్లీట్ చేసి రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం అని మేకర్స్ తెలిపారు. 2024లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Sheer joy working with Siva & Team on this mighty saga. Happy to share the title look of #Kanguvahttps://t.co/7TiAfM2fTE@directorsiva @ThisIsDSP @kegvraja @DishPatani @vetrivisuals @SupremeSundar_ @StudioGreen2 @UV_Creations @saregamasouth pic.twitter.com/pcdKo99wAj
— Suriya Sivakumar (@Suriya_offl) April 16, 2023