Tapeswaram Kaja: శర్వానంద్, రష్మికలకు బాహుబలి కాజా 

25 Oct, 2021 08:56 IST|Sakshi

మండపేట(తూర్పుగోదావరి): సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన సినీతారలను తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్‌ బాహుబలి కాజాతో సత్కరించింది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం షూటింగ్‌ ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగింది. షూటింగ్‌లో పాల్గొన్న హీరో శర్వానంద్, హీరోయిన్‌ రష్మికలకు సురుచి పీఆర్‌ఓ వర్మ బాహుబలి కాజాలను అందజేశారు. శర్వానంద్‌ మాట్లాడుతూ తనకు మడత కాజా అంటే చాలా ఇష్టమని, గతంలో తాను సురుచిని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారని వర్మ తెలిపారు.


చదవండి: పూరి జగన్నాథ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు