Surya: కుటుంబంతో విడిపోయిన సూర్య.. ఆమెనే కారణమట..!

1 Mar, 2023 21:33 IST|Sakshi

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల్లో సూర్య ఒకరు. టాలీవుడ్‌ అభిమానుల్లోనూ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఈ కోలీవుడ్‌ స్టార్‌ నటుడు సూర్య వైవిధ్యభరిత కథా చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. 2డీ ఎంటర్‌ టైన్‌మెంట్‌ పతాకంపై ఇప్పటికే పలు సక్సెస్‌ ఫుల్‌ చిత్రాలను నిర్మించారు. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో వీర్‌ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన 42వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం తరువాత వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారు. అయితే తాజాగా సూర్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్ చల్‌ చేస్తోంది. 

కాగా.. సూర్య 2006లో నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు దియా, దేవ్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయ్యాక కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక.. పిల్లలు పెద్దయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అందులో సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నారు. తాజాగా భార్య జ్యోతిక కారణంగానే సూర్య తన తండ్రి, తమ్ముడితో విడిపోయారన్న రూమర్స్ వినిపిస్తున్నాయి.

దీనిపై ప్రముఖ తమిళ నటుడు బైల్వాన్‌ రంగనాథన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు సూర్య ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయ్యాడని.. సూర్యకు ఆయన తండ్రి శివకుమార్‌కు సంబంధాలు సరిగా లేవన్నారు. సూర్య, జ్యోతికల ప్రేమను శివకుమార్‌ మొదట వ్యతిరేకించారని.. తర్వాతే కుమారుడి కోసం ఒప్పుకున్నారు. అయితే పెళ్లి తర్వాత జ్యోతికను సినిమాల్లో నటించవద్దని ఆదేశించాడు. అందువల్లే  ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని బైల్వాన్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జ్యోతిక సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జ్యోతిక మళ్లీ సినిమాల్లో నటించడాన్ని శివకుమార్‌ స్వాగతించలేకపోతున్నారని సమాచారం. దీనివల్లే తండ్రీ, కొడుకుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సూర్య తన ఫ్యామిలీ నుంచి వేరుపడాలని భావించినట్లు తెలుస్తోంది.

కాగా.. సూర్య, జ్యోతిక 2డి అనే నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. ఈ సంస్థ ద్వారా ఎన్నో నాణ్యమైన చిత్రాలను అందిస్తున్నారు. రీల్‌ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్‌లోనూ సక్సెస్‌ఫుల్ జంటగా నిలిచిన సూర్య, జ్యోతిక మొదట చెన్నైలో ఉమ్మడి కుటుంబంలోనే జీవించారు. అయితే ఇటీవలే ఇద్దరూ ముంబైలో కొత్త ఇల్లు కొని సెటిల్ అయ్యారు. 
 

మరిన్ని వార్తలు