హిందీలోకి ‘సూరరై పోట్రు’, బాలీవుడ్‌లోకి నిర్మాతగా సూర్య ఎంట్రీ

12 Jul, 2021 15:18 IST|Sakshi

హీరో సూర్య ఇటీవల నటించిన తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో డబ్‌ అయిన సంగతి తెలిసిందే. సూర్య, జ్యోతికలు కలిసి నిర్మించిన ఈ చిత్రం కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఓటీటీలో విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగు తమిళంలో మంచి రెస్పాన్స్‌  అందుకున్న ఈ మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్‌ చేయబోతున్నట్లు సూర్య సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. 

సూర్య, జ్యోతిక, రాజశేఖర్‌ పాండియన్‌లు సంయుక్తంగా ఈ మూవీని అబన్‌డంతియ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై బాలీవుడ్‌లో నిర్మించబోతున్నారు. ఈ రీమేక్‌ ద్వారా హీరో సూర్య బాలీవుడ్‌లోకి నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. దర్శకుడు సుధా కొంగర బాలీవుడ్‌లోనూ డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఇక హీరో ఎవరన్నది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. హీరో, నటీనటులు ఎవరన్నది త్వరలోనే అధికారిక ప్రకటన వెలువనుంది.  

మరిన్ని వార్తలు