మరో సాహసం చేస్తున్న హీరో సూర్య

15 Oct, 2023 09:32 IST|Sakshi

నటుడు సూర్య ఇటీవల వైవిద్య భరిత పాత్రలకు కేరాఫ్‌గా మారారనే చెప్పాలి. ఆయన సమీపకాలంలో నటించిన జై భీమ్‌, ఆకాశం నీ హద్దురా చిత్రాలలో సరికొత్తగా కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కంగువ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. చారిత్రక కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక యోధుడుగా సూర్య పాత్ర గానీ గెటప్‌ గానీ ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్‌న్స్‌ సంస్థతో కలిసి కేఈ. జ్ఞానవేల్‌ రాజా తన స్టూడియో గ్రీన్‌ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నారు.

(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి)

ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటాని నాయకిగా నటిస్తోంది. ఈమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. కాగా విచిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్‌ విడుదలై కంగువపై ఆసక్తిని పెంచేశాయి. కాగా ఈ చిత్రాన్ని 2024లో సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయడానికి నిర్మాతలు చేస్తున్నారు. కాగా నటుడు సూర్య తన తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో నటించనున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు ఆకాశం నీ హద్దురా వంటి సూపర్‌ హిట్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి హిట్‌ కొట్టడానికి ఈ కాంబో సిద్ధమవుతోంది.

విశేషం ఏంటంటే ఈ చిత్రంలో సూర్య మరోసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. అందులో కొడుకు కళాశాల విద్యార్థిగా నటిస్తున్నట్లు అందుకు తగ్గట్టుగా ఆయన తనను మలుచుకోవడానికి వర్కౌట్‌ చేస్తున్నట్లు తెలిసింది. అందుకు గాను ఆయన 20 ఏళ్ల వ్యక్తిలా కనిపించనున్నాడట. ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేయడం సూర్యకు మాత్రమే సాధ్యం అని ఆయన ఫాన్స్‌ చెప్తున్నారు.

 కాగా మరో ముఖ్య పాత్రలో మలయాళ యువస్టార్‌ దుల్కర్‌సల్మాన్‌ను నటింప చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కాగా నవంబర్‌ రెండో వారంలో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. జీవి ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందించనున్న 2డీ ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు తాజా సమాచారం.

మరిన్ని వార్తలు