‘యాగం చేస్తేనే కరోనా అంతం, మోదీని డబ్బులడిగితే ఇవ్వలేదు’

12 Apr, 2021 06:48 IST|Sakshi

చెన్నై: నటుడు రజినీకాంత్‌ రాజకీయాల గురించి పదిహేనేళ్ల క్రితం చెప్పానని రాజగురు బ్రహ్మశ్రీ గురువాయూర్‌ సూర్యన్‌ నంబూద్రి స్వామి పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ, హిందూ మతాధిపతులు తమిళనాడు ముఖ్యమంత్రి పలువురిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు వేదాల్లో నిష్ణాతులైన ఈయన కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ధరణి రక్ష మహాయాగం చేయ తలపెట్టారు. అయితే అందుకు ప్రధానమంత్రి నుంచి కోట్లాది ఆస్తి కలిగిన పీఠాధిపతుల వరకు ఎవరు ఆర్థిక సాయం చేయలేదని విమర్శించారు. యాగాన్ని  జరిపిస్తే కరోనా వ్యాధి తగ్గిపోతుందన్నారు.

అలా ఆరు నెలలపాటు తాను యాగాన్ని నిర్వహించాలని, తర్వాత ఆర్థిక స్థోమత లేక నిలిపివేసినట్లు తెలిపారు. సూర్యన్‌ నంబూద్రి స్వామి శనివారం సాయంత్రం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అధర్వన వేదం నడుస్తోందని, కరోనా వ్యాధి వ్యాప్తికి ఇంద్రాది దేవతల ఆగ్రహం కారణమని పేర్కొన్నారు. ఈ వ్యాధిని తగ్గించడానికి ధరణి రక్ష మహా యాగం చేస్తే  ప్రపంచ జనాన్ని కాపాడవచ్చని. ఇది ఖర్చుతో కూడిన యాగం కావడంతో తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సహా దేశంలోని పీఠాధిపతులందరికీ సాయం కోసం లేఖలు రాశారు.

అయితే ఎవరు స్పందించలేదన్నారు. సంతోషాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి యాగాలు చేయించే వాళ్లు దేశ ప్రజల కోసం తాను తలపెట్టిన ధరణి రక్ష యాగానికి సహకరించకపోవడం శోచనీయమన్నారు. హిందువుల పరిరక్షణ తమ ధ్యేయమని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన లేఖకు స్పందించలేదని విమర్శించారు.
చదవండి: కరోనాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మృతి

మరిన్ని వార్తలు