‘అప్పట్లో సుశాంత్‌, ఆమె ప్రేమలో ఉన్నారు’

20 Aug, 2020 21:02 IST|Sakshi

ముంబై: దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో రోజు రోజుకు అసక్తికర విషయాలు బయటకే వస్తున్నాయి. తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్, సుశాంత్ ఇద్దరూ ప్రేమించుకున్నారని సుశాంత్‌ స్నేహితుడు శామ్యూల్ హోకిప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శామ్యూల్ ఈ విషయం గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.‌ ‘కేదార్ నాథ్' చిత్రంలో సుశాంత్, సారా ఇద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. సినిమా ప్రమోషన్ సమయంలో సుశాంత్‌, సారా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు’ అని తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకోచ్చాడు. సుశాంత్ తదుపరి సినిమా 'సోన్ చిరియా' ప్లాప్‌ అవ్వడంతో సారా అతడిని విడిచి వెళ్లిపోయిందని, ఈ విషయం తనను ఆశ్చర్యపరిచిందని శామ్యూల్‌ చెప్పాడు. (చదవండి: రియా సీబీఐకి తప్పక సహకరిస్తుంది)

We accept the love we think we deserve -Stephen Chbosky

A post shared by Samuel Haokip (@jamlenpao) on

బాలీవుడ్ మాఫియా వల్లే సుశాంత్‌ ‘సోన్‌ చిరియా’ చిత్రం ఫ్లాప్ అయిందని అతడు ఆరోపించాడు. అదే విధంగా బాలీవుడ్‌ క్వీన్‌ కంగన రనౌత్‌ కూడ ఆసుశాంత్, సారాల రిలేషన్‌షిప్‌పై ట్వీట్‌ చేశారు. ‘‘బ్రేకింగ్‌ న్యూస్ ఆఫ్ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌(ఎస్‌ఎస్‌ఆర్‌), సారాల రిలేషన్‌షిప్‌. వారి ప్రేమ వ్యవహారం ప్రస్తుతం మీడియాలో ముఖ్యాంశంగా మారింది. అవుట్‌ డోర్‌ షూటింగ్‌లో వారిద్దరూ ఒకే రూంలో ఉన్నారన్న విషయం కూడా స్పష్టం అవుతోంది. ఈ ఫ్యాన్సీ నేపోటిజంలో స్టార్‌ కిడ్స్‌ బయటి నుంచి వచ్చిన వారి డ్రీమ్స్‌తో ఆడుకుంటారు. ఆ తరువాత వారి జీవితాలను బహిరంగంగా నాశనం చేస్తారు’ అంటూ కంగనా ట్వీట్‌ చేశారు. అయితే ఈ కేసు విషయంలో సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి సుశాంత్‌ డబ్బును దొంగలించిందని, అతడి ఆత్మహత్యకు ప్రేరేపించేలా ప్రవర్తించేదని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ‌ కేసులో కొత్తగా సారా పేరు వినిపించడంతో కేసు కొత్త మలుపు తిరిగిందని చెప్పుకొవచ్చు. (చదవండి: సుశాంత్ డిప్రెష‌న్ వల్లే చ‌నిపోయి ఉండొచ్చేమో)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా