సుశాంత్‌.. నువ్వు లేకుండా జీవితం లేదు: రియా భావోద్వేగం

14 Jun, 2021 20:45 IST|Sakshi

ముంబై: బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణించి నేటికి ఏడాది గడుస్తోంది. 2020 జూన్‌ 14వ తేదిన బాంద్రాలోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. సుశాంత్‌ ఈ ప్రపంచాన్ని వీడి ఏడాది పూర్తవడంతో సినీ ప్రముఖులు, అభిమానులు, అందరూ నటుడిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా.. నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా.. సుశాంత్ మరణించే సమయంలో ఆయన ప్రియురాలిగా ఉన్న రియా చక్రవర్తి, సుశాంత్‏ను తలుచుకుంటూ తన ఇన్‏స్టాగ్రామ్‏లో భావోద్వేగ పోస్ట్ చేసింది. సుశాంత్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. నిన్ను తలచుకోని క్షణం లేదంటూ రాసుకొచ్చింది.

‘నువ్వు ఇక్కడ లేవనే నిజాన్ని నేనింకా నమ్మలేకపోతున్నాను. టైమ్‌ అన్నింటిని నయం చేస్తుందని విన్నాను. కానీ నువ్వే నా టైమ్‌. నా సర‍్వస్వం నువ్వే. నిన్ను తలచుకోని క్షణమంటూ లేదు. నువ్వు ఎక్కడున్న నన్ను అనుక్షణం చూస్తూ.. నన్ను ఎల్లప్పుడు రక్షిస్తుంటావు. నువ్వు నన్ను నీతోపాటే తీసుకెళ్తావని ప్రతిరోజూ ఎదురుచూస్తున్నాను.. నీ కోసం ప్రతి చోట వెతుకుతున్నాను. నా వెంటే ఉన్నావని అనుకుంటున్నాను. కానీ కొన్నిసార్లు గుండె పగిలేలా చేస్తావు. నువ్వు సాధించావు బేబూ అని మనసులో అనుకొని మరుసటి రోజు కోసం ఎదురుచూస్తుంటాను” అని రియా చక్రవర్తి తన పోస్టులో రాసుకొచ్చింది.

‘నువ్వు నా పక్కన లేవనే విషయం నా గుండెలో ఎన్నో ఎమోషన్స్ రేకెత్తిస్తుంది. ఈ విషయం బయటకు చెప్పడానికి గుండె పగిపోయేంత బాధ నాలో ఉంది. నువ్వు లేకుండా నా జీవితం లేదు. జీవితం అనే అర్ధాన్ని నువ్వే తీసుకెళ్లావ్‌. ఈ శూన్యాన్ని ఎవరూ పూడ్చలేరు. నువ్వు లేకుండా ఒక్కదాన్నే నిల్చోని ఉన్నాను. నా స్వీట్ బాయ్ కోసం ఇంకా ఎదురుచూస్తునే ఉంటాను. నేను మీకు ప్రతిరోజూ 'మాల్పువా' ఇస్తాను. ఈ ప్రపంచంలోని అన్ని క్వాంటం ఫిజిక్స్ పుస్తకాలను చదువుతానని వాగ్దానం చేస్తున్నాను.  దయచేసి నా వద్దకు తిరిగి వచ్చేయ్‌. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

చదవండి: Viral Video: ప్రియురాలితో సుశాంత్‌ సింగ్‌ స్టెప్పులు

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

మరిన్ని వార్తలు