ఐఫా అవార్డుల్లో సుశాంత్‌ను అపహాస్యం చేశారు: జిమ్‌ పార్ట్‌నర్‌

15 Aug, 2020 19:50 IST|Sakshi

ముంబై: బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో రోజురోజుకు విస్తుపోయే విషయాలు వెలుగు చుస్తున్నాయి. ఈ క్రమంలో సుశాంత్‌ సినీ జీవితాన్ని అంతం చేసేందుకు కొంతమంది చూశారని సుశాంత్‌ జిమ్‌ పార్ట్‌నర్‌ సునీల్‌ శుక్లా సుప్రీం కోర్టులో ఇంటర్వెన్షన్ పిటిషన్‌ దాఖలు చేశాడు. అంతేగాక బాంద్రా పోలీసు స్టేసన్‌లో ఫిర్యాదు కూడా చేశానని అతడు తెలిపాడు. సుశాంత్‌ సినిమాలను విడుదల కాకుండా చేసి తన సినీ జీవితాన్ని అంతం చేయాలని కొంతమంది ప్రయత్నించారని అతడు ఆరోపించాడు. ఈ కేసును ముంబై పోలీసులకు బదులు సీబీఐ దర్యాప్తు చేస్తే మంచిదని అతడు పిటిషన్‌లో పేర్కొన్నాడు. అదే విధంగా సుశాంత్ నటించిన ‘డ్రైవ్‌’ చిత్రాన్ని థియోటర్‌లో విడుదల చేయకుండా కావాలనే ఓటీటీ ఫాంలో విడుదల చేసినట్లు అతడు తెలిపాడు. అలాగే మకావులో జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమంలో సుశాంత్‌ను అపహాస్యం చేశారని సునీల్‌ తెలిపాడు. (చదవండి: సుశాంత్‌ కేసు : ఫోరెన్సిక్‌ నివేదికలో కీలక విషయాలు)

ఇలా సుశాంత్‌ను పలుమార్లు అవమానించారని ఇవి సుశాంత్‌ను తీవ్రంగా బాధించాయన్నాడు. అతడు మానసిక ఒత్తిడికి గురవ్వడానికి ఇవి కూడా ఓ కారణమని సునీల్‌ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు సుశాంత్‌కు సంబంధించిన చాలా సమాచారం తన వద్ద ఉందని, అది పోలీసులకు వెల్లడించాలని కోరాడు. అయితే దీనిపై ఇదివరకే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. తన స్టేట్‌మెంట్‌ రికార్టు చేసినప్పటికీ తనని పిలవలేదన్నాడు. దీంతో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు సునీల్‌ మీడియాతో పేర్కొన్నాడు. ఇటీవల సుశాంత్‌ మృతి కేసులో అతడి స్నేహితురాలు రియా చక్రవర్తిని మనిలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రెండు సార్లు విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రియాతో పాటు ఆమె తండ్రి, సోదరుడు,  ఆమె మేనేజర్‌ శ్రుతి మోడీ, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ రితేష్‌ షాను కూడా ఈడీ ప్రశ్నించింది.
(చదవండి: సుశాంత్ మ‌ర‌ణం పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకుందా?)

మరిన్ని వార్తలు