సుశాంత్‌ కేసులో మరో మలుపు.. సుప్రీంకు రియా

29 Jul, 2020 17:03 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ యువనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ ముంబై పోలీసులకు అప్పగించాలని ఆమె న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విషయాన్ని రియా లాయర్‌ సతీష్‌ మీడియాకు వెల్లడించాడు. కాగా, ఈ కేసులో రియా పాత్రపై విచారణ చేపట్టాలని సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఇటీవల పట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రియాతోపాటు మరికొందరు స్నేహితులు మోసం, కుట్రకు పాల్పడటం ద్వారా సుశాంత్‌ ఆత్మహత్యకు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశాంత్‌ ఆత్మహత్యకు  సరిగ్గా 6 రోజుల ముందు డబ్బు, నగలతో ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోయిందని చెప్పారు.(సుశాంత్‌ తండ్రి ఫిర్యాదు.. రియాపై కేసు నమోదు)

కేకే సింగ్‌ ఫిర్యాదుతో బిహార్‌ పోలీసులు రియాతో పాటు మరో ఐదుగురిపైన  కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ముంబైకి నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని పంపారు. అలాగే సుశాంత్‌ అకౌంట్‌ నుంచి రియాకు రూ. 15 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ అయినట్టు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రియాను విచారించడంతోపాటుగా, అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రియా సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆమె ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం.(రియాపై ఫిర్యాదు.. అంకిత స్పందన)

కాగా, సుశాంత్‌ ఆత్మహత్య పాల్పడం మొదటి నుంచి పలు అనుమానాలు కేంద్ర బిందువుగా నిలిచింది. బాలీవుడ్‌లో నెలకొన్న బంధుప్రీతి వల్ల ఆయన ఆత్మహత్యకు చేసుకోవాల్సి వచ్చిందని కొందరు ఆరోపించారు. మరికొందరు ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందని.. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అయితే ఇన్ని రోజులు ఈ కేసుకు ఎటువంటి విమర్శలు చేయని.. సుశాంత్‌ కుటుంబసభ్యులు రియాతో పాటుగా మరికొందరిపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగించాలని హోం మంత్రి అమిత్‌ షా విజ్ఞప్తి చేసిన రియా.. ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సుశాంత్‌ ఆత్మహత్య వెనక పెద్ద కుట్ర దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా