భావోద్వేగం: సుశాంత్‌ రాసుకున్న లేఖ వైరల్‌

13 Jan, 2021 14:41 IST|Sakshi

నా జీవితంలో ఇప్పటికే 30 ఏళ్లు గడిపాను. మొదటి 30 ఏళ్లను ప్రత్యేకంగా మలుచుకునేందుకు చాలా ప్రయత్నించాను..

ముంబై: దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి చెంది ఏడు నెలలు గడిచాయి. గతేడాది జూన్‌ 14న సుశాంత్‌ తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడి‌ మృతి కేసులో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ రాసుకున్న ఓ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆయన సోదరి శ్వేతా సింగ్‌ బుధవారం దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘భాయ్‌ రాసుకున్న లేఖ.. ఆయన ఆలోచనలు చాలా లోతైనవి’ అంటూ ఆమె పంచుకున్నారు. ‘నా జీవితంలో ఇప్పటికే 30 ఏళ్లు గడిపాను. ఈ మొదటి 30 ఏళ్లను ప్రత్యేకంగా మలుచుకునేందుకు చాలా ప్రయత్నించాను. ఇందుకోసం నా ప్రతి పనిలో మంచిగా ఉండాలని కోరుకున్నాను. అలాగే టెన్నిస్‌, స్కూల్‌, చదువు, ర్యాంక్స్‌లో మొదటి స్థానంలో ఉండాలనుకున్నాను.

అయితే ప్రతి కోణాన్ని అలా చూడటం వల్ల నేను అసంతృప్తికి లోనయ్యేవాడిని. నాకు మంచి జరిగినప్పుడు మాత్రం ఆట తప్పుగా ఆడానని గ్రహించాను. ఎందుకంటే నేనేంటో తెలుసుకోవడానికే ఆట ఉంది’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ లేఖ నెటిజన్‌లను తెగ ఆకట్టుకుంటోంది. సుశాంత్ జీవితంపై ఎన్నో ఆశలతో రాసుకున్న ఈ లేఖ చూసి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా సుశాంత్‌ గతేడాది జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
 (చదవండి: సుశాంత్‌ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది: హైకోర్టు)

అయితే తన కొడుకును ఆత్మహత్యకు ప్రేరెపించేలా నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తిలు ప్రవర్తించారని ఆరోపిస్తు సుశాంత్‌ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆయన ఫిర్యాదు మేరకు సుశాంత్‌ మృతి కేసును దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు అనంతరం ఈ కేసు విచారణకై నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరోకు ఇచ్చింది. ఈ క్రమంలో ఎన్‌సీబీ విచారణలో బాలీవుడ్‌ డ్రగ్‌ వ్యవహరం వెలుగు చూడటంతో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులకు ఎన్‌సీబీ అధికారులు సమన్లు అందజేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రియాను పోలీసులు సెప్టెంబర్‌లో‌ అరెస్టు చేసి జెలుగా తరలించగా ఇటీవలకామె బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. 
చదవండి: రియా కొత్త ఫొటో వైరల్‌.. మండిపడుతున్న నెటిజన్లు

A post shared by Shweta Singh kirti (SSK) (@shwetasinghkirti)

మరిన్ని వార్తలు