జ‌స్టిస్ ఫ‌ర్ సుశాంత్.. నిజాలు బ‌య‌ట‌పెట్టాలి

29 Jul, 2020 10:55 IST|Sakshi

సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించిన కేసులో  న్యాయం చేయాల‌ని కోరుతూ సుశాంత్ సోద‌రి శ్వేతా కీర్తిసింగ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడూ నిజాలు బ‌య‌ట‌ప‌డ‌వు. జ‌స్టిస్ ఫ‌ర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసులో గ‌త కొన్ని రోజులుగా కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్‌ మృతిపై ఆయన తండ్రి కేకే సింగ్‌ పోలీసులను ఆశ్రయించిన సంగ‌తి తెలిసిందే. సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తిపైన పట్నాలోని రాజేంద్రనగర్‌ పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రియాతోపాటు మరికొందరు స్నేహితులు మోసం, కుట్రకు పాల్పడటం ద్వారా సుశాంత్‌ ఆత్మహత్యకు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విమర్శలు చేయని.. సుశాంత్‌ కుటుంబం ఇప్పుడు రియాపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా సుశాంత్ అకౌంట్ నుంచి రియా చక్ర‌వ‌ర్తికి 15 కోట్లు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్లు పోలీసులు గుర్తించారు. (సుశాంత్‌ తండ్రి ఫిర్యాదు.. రియాపై కేసు నమోదు)

సుశాంత్ ఆత్మ‌హ‌త్య బాలీవుడ్‌లో పెను ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. నెపోటిజంపై బాహాటంగానే విమ‌ర్శ‌లు చేసిన న‌టి కంగ‌నా ర‌నౌత్ బీటౌన్‌లో పెద్ద చ‌ర్చ‌ను లేవ‌నెత్తారు. క‌ర‌ణ్ జోహార్, ఆదిత్య చోప్రా సుశాంత్‌ను బెదిరించార‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ఛైర్మన్ ఆదిత్య చోప్రా వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు నమోదు చేశారు. ఈ నిర్మాణ సంస్థ సుశాంత్‌తో మూడు సినిమాల‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నా రెండు మాత్ర‌మే నిర్మించిన‌ట్లు తెలుస్తోంది.

ఇక క‌ర‌ణ్ జోహార్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ధర్మ ప్రొడక్షన్ పై కూడా కేసు న‌మోదైన నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం సీఈఓ  అపూర్వ మెహతా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఒక‌వేళ అవ‌స‌ర‌మైతే క‌ర‌ణ్ జోహార్ కూడా విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని మ‌హారాష్ర్ట హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ సైతం ఇటీవ‌ల వ్యాఖ్య‌లు చేశారు.  ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నౌను కూడా విచార‌ణ‌కు పిల‌వ‌గా ప్ర‌స్తుత  క‌రోనా నేప‌థ్యంలో తాను ముంబై రాలేన‌ని, తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అధికారుల బృందాన్ని మనాలికి పంపాలని, లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజ‌రవుతాన‌ని పేర్కొంది. కాగా సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసుసు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటివరకు 42 మంది స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. (‘కంగనపై ఈర్ష్య, అసూయతోనే విమర్శలు’)

If truth doesn’t matter, nothing ever will! #justiceforsushantsinghrajput

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on


 

మరిన్ని వార్తలు