Sushanth: వర్జినా? అన్న ప్రశ్నకు సుశాంత్‌ ఏమని ఆన్సరిచ్చాడంటే?

5 Jun, 2022 16:15 IST|Sakshi

హీరో సుశాంత్‌ ప్రస్తుతం రవితేజ రావణాసుర మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అలాగే జీ5లో ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తున్నాడు. తాజాగా ఆయన అభిమానులతో ముచ్చటించాడు. చాలాకాలమవుతోంది, మీరు ప్రశ్నలు సంధించండి, సమాధానాలు చెప్తానన్నాడు. దీంతో దొరికిందే ఛాన్స్‌ అనుకున్న ఫ్యాన్స్‌ వరుస ప్రశ్నలతో హీరోను ఉక్కిరిబిక్కిరి చేశారు. అయినప్పటికీ సుశాంత్‌ అన్నింటికీ నిదానంగా, ఓర్పుగా సమాధానాలిచ్చాడు.

ఎప్పటిలాగే ఈసారి కూడా సుశాంత్‌కు పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మీరు పెళ్లి చేసుకునే తారీఖు చెప్పండని ఓ నెటిజన్‌ అడిగాడు. దీనికి హీరో స్పందిస్తూ ఎవరనేది డిసైడ్‌ కాకుండానే పెళ్లి డేట్‌ చెప్పాలా? అని ఫన్నీ కౌంటరిచ్చాడు. అల్లు అర్జున్‌తో మళ్లీ ఎప్పుడు చేస్తారు? అన్నదానికి బహుశా అల వైకుంఠపురములో సెకండ్‌ పార్ట్‌లోనేమో, బన్నీనే అడగండి అన్నాడు. 

చై, అఖిల్‌ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోమంటే అసలు ఈ ప్రశ్నే రాంగ్‌ అని కొట్టిపారేశాడు. నువ్వు వర్జినా అని అడిగిన ఓ నెటిజన్‌కు తాను నిప్పు అని అర్థం వచ్చేలా వెలుగుతున్న దీపం ఫొటోను షేర్‌ చేశాడు.

చదవండి: సీఎంను కలిసిన నయనతార.. ఫొటో వైరల్‌..
'జన గణ మన' మూవీ రివ్యూ

మరిన్ని వార్తలు