సుశాంత్‌ బిల్ ‌బోర్డులను తొలగించిన యూఎస్‌ మీడియా సంస్థ

3 Sep, 2020 14:44 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన బిల్‌ బోర్డులను తొలగించడానికి అమెరికా మీడియా సంస్థ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఈ మెయిల్‌ ద్వారా సుశాంత్‌ సింగ్‌  సోదరి ‍శ్వేతా సింగ్‌కు తెలిపింది. ఈ మెయిల్‌కు సంబంధించిన  స్క్రీన్ షాట్లను శ్వేత తన సోషల్‌ మీడియా  ఖాతాల ద్వారా పంచుకుంది. ​ జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌ పేరుతో కొన్ని బిల్‌ బోర్డులను అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రచారం ద్వారా ఆయనతో సంబంధం ఒక మహిళను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆ మీడియా సంస్థ మెయిల్‌లో తెలిపింది. ఆ కారణంగానే ఆ బిల్‌ బోర్డులను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. 

దీనిపై శ్వేత సింగ్ సోషల్ ‌మీడియా  వేదికగా స్పందించారు. పెయిడ్‌ పీఆర్‌ ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తోంది. ఈ కారణంగానే హాలీవుడ్‌ బిల్‌బోర్డు సంస్థ సుశాంత్‌ బిల్‌బోర్డును తొలగిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. బిల్‌బోర్డు ద్వారా న్యాయమైన విచారణ, న్యాయం మాత్రమే కోరుతున్నాము! #Report4SSR #JusticeForSushantSinghRajputt #Warriors4SSR అని ఆమె ట్వీట్‌ చేశారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14 వ తేదిన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. తరువాత ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌ అంటూ ప్రచారం సాగుతోంది.  

Thanks Chicago! 🙏❤️🙏 Lets Stay United and keep demanding justice for Sushant. #JusticeForSushantSinghRajput #GlobalParyerForSSR

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

చదవండి: సుశాంత్‌ డ్రగ్స్‌ కేసులో ఇద్దరు అరెస్ట్‌

మరిన్ని వార్తలు