సుశాంత్‌ కేసు: అసలు ఎవరీ శ్రుతి మోదీ

7 Aug, 2020 12:21 IST|Sakshi

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇప్పటికే సుశాంత్ కేసులో బిహార్ ప్రభుత్వం, కేంద్రం. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించామని సుప్రీంకోర్టుకు తెలపడంతో సర్వోన్నత న్యాయస్థానం సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. దీంతో ఈ కేసులోని మిస్టరీని ఛేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సుశాంత్‌ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరుగురిని నిందితులుగా చేర్చుతూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. రియా చక్రవర్తిని ఏ1 నిందితురాలుగా ప్రకటించింది. ఆమెతో పాటు ఈ కేసులో ఏ2గా రియా తం‍డ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, ఏ3గా తల్లి సంధ్య చక్రవర్తి, ఏ4గా సోదరుడు షోవిక్ చక్రవర్తి, ఏ5గా సుశాంత్ ఇంటి మేనేజరు శామ్యూల్ మిరిండా, ఏ6గా  సుశాంత్ బిజినెస్ మాజీ మేనేజరు శ్రుతి మోదీతో పాటు పలువురును ఈ కేసులో నిందితులుగా చేర్చింది. (సీబీఐ దర్యాప్తు: రియా స్పందన)

కాగా ఈ కేసును సుశాంత్‌ కుటుంబం బీహార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయగా, తాజాగా ఈ రోజు(శుక్రవారం) తమ ఎదుట హాజరు అవ్వాలని సుషాంత్‌ మాజీ మేనేజర్‌ శ్రుతికి ఈడీ సమన్లు జారీ చేసింది. అలాగే రేపటిలోగా సుశాంత్‌ స్నేహితుడు సిద్ధార్థ్‌ పిథాని కూడా హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఇదిలా ఉండగా ఎఫ్‌ఐఆర్‌లో కొత్తగా శ్రుతి మోదీ పేరు వినిపించడంతో అసలు ఈ శ్రుతి ఎవరే ప్రశ్న ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మెదులుతోంది. (సుశాంత్‌ మృతిపై సీబీఐ విచారణ ప్రారంభం)

సుశాంత్‌, రియా ఇద్దరికి బాగా తెలిసిన వ్యక్తి. శ్రుతి మోదీ.. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తికి మాజీ మేనేజర్ అని తెలుస్తోంది. అలాగే ఈమె సుశాంత్‌ మాజీ బిజినెస్‌ మేనేజర్ అని వెల్లడైంది. సుశాంత్‌ మరణంపై దర్యాప్తులో భాగంగా ముంబై పోలీసులు శ్రుతి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. శుత్రి ముంబై పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ప్రకారం.. ఆమె జూలై 2019 నుంచి 2020 ఫిబ్రవరి వరకు సుశాంత్‌తో కలిసి పనిచేసినట్లు తెలిపింది. సుశాంత్ ఆర్థికంగా ఉన్నవాడని, బాంద్రాలోని తన ఇంటి అద్దె సుమారు రూ. 4.5 లక్షలతోపాటు నెలకు దాదాపు 10 లక్షలు ఖర్చు చేసేవారని శ్రుతి ముంబై పోలీసులకు తెలిపింది. (ఈడీ దర్యాప్తు: షాకిస్తున్న రియా ఆస్తుల లిస్ట్‌)

మరిన్ని వార్తలు