టీజర్‌: సుశాంత్‌కు ప్రభాస్‌ విషెస్‌

29 Jan, 2021 09:56 IST|Sakshi

తన లైఫ్‌లో అమ్మకు.. అమ్మాయికి.. బైక్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉందంటూ యువ నటుడు సుశాంత్‌ చెబుతున్నాడు. డి.దర్శన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా టీజర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌ను రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ విడుదల చేశాడు. సుశాంత్‌కు, చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అంటూ సినిమా టీజర్‌ను ప్రభాస్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇక చూస్కోండి అంటూ టీజర్‌ను వదిలాడు.

ఈ సినిమా  బైక్‌ పార్కింగ్‌ నేపథ్యంలో సినిమా కొనసాగుతుందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనం కొనుగోలు చేయడం.. దానిపై హీరోయిన్‌ను ఎక్కించుకోవడం.. అనంతరం నో పార్కింగ్‌ స్థలంలో బండి నిలపడం ప్రధాన కథగా ఉండనుందని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మాణంలో ఏ1 స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్‌ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సుశాంత్‌కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సంగీతం ప్రవీణ్‌ లక్కరాజు అందిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు