తండ్రి బర్త్‌డేకు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోన్న సుస్మిత కొణిదెల

20 Aug, 2021 09:38 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి సైరా నరసింహ రెడ్డి మూవీకి ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె తన భ‌ర్త విష్ణు ప్ర‌సాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అనే ప్రొడక్షన్‌ హోజ్‌ను లాంచ్‌ చేసింది. జీ5 ఒరిజిన‌ల్ సిరీస్ షూట్‌ ఎఫైర్‌ను నిర్మించిన సుస్మిత. ఆగ‌స్టు 22న త‌న తండ్రి చిరంజీవి పుట్టిన‌రోజున ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేయ‌బోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. 

చదవండి: మళ్లీ వాయిదా పడిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ!

వెబ్ సిరీస్ త‌ర్వాత త‌న‌ రెండో ప్రాజెక్ట్‌ను ప్ర‌క‌టించ‌బోతున్నానంటూ ట్విట‌ర్‌లో ఓ టీజర్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా సుస్మిత ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి మీకు మరో ఫన్‌ను అందించబోతున్నామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేంటో డాడీ బర్త్‌డే సందర్భంగా ఆగష్టు 21. 8.2021 తేదీన వెల్లడిస్తాను’ అంటూ ఆమె రాసుకొచ్చింది. దిమ్మ‌లపాటి ప్ర‌శాంత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నట్లు తెలుస్తోంది.

(చదవండి: బాలయ్య సినిమాకు నో చెప్పిన విలక్షణ నటుడు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు