సుష్మితకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రియుడు

30 Nov, 2020 13:44 IST|Sakshi

ప్రియుడు రోహ్మాన్‌ షాల్‌ను నుంచి సర్‌ప్రైజ్‌ తీసుకుంది ఒకప్పటి అందాల బామ సుష్మిత సేన్‌. ఈ మాజీ విశ్వసుందరిని ఇష్టపడేవారంత తనని సుషు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇదే పేరును ఇన్‌ఫినిటి సింబల్‌తో  కలిపి చేతిమీద టాటూ వేయించుకున్నాడు ఆమె ప్రియుడు.  తన ప్రేమ అనంతమైనదని తెలియ జేశాడు కశ్మీర్‌ మోడల్‌. దానికి సంబంధించిన ఫోటోను ప్రియుడు ఇన్‌స్టాలో పెట్టగా సుషు షేర్‌ చేసింది.

'ఇంక్‌ శాశ్వతం కాదని ప్రేమ మాత్రమే శాశ్వతమని' తన టాటూ ఫోటోలో రాశాడు రోహ్మాన్‌. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఫోటోను షేర్‌ చేస్తూ రో'హ'మెన్స్‌ అని రాసింది సుష్మిత. సోషల్‌ మీడియా వేదికగా మాటలు కలుపుకున్న వీరిద్దరి మధ్య అతి తక్కువ సమయంలోనే ప్రేమ చిగురించింది. చాలా బంధాలలో విఫలమైన సుష్మిత తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన కశ్మీర్‌ మోడల్‌తో కొత్త బంధాన్ని ఏర్పరుచుకుంది. ఇదే విషయాన్ని ప్రేమకు చిహ్నమైన తాజ్‌ మహాల్‌ దగ్గర దిగిన పిక్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేసి అధికారికంగా ప్రకటించారీ నవ జంట.   చదవండి:  (నా కేరాఫ్‌ అడ్రస్‌ నాన్నే: ఆకాష్‌ పూరీ)

తమ బంధాన్ని గురించి తెలియజేయడానికి ఎప్పుడూ మొహమాట పడలేదు ఈ అందమైన జంట. ఎప్పటికప్పుడు వారు దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో తమ అభిమానుల కోసం షేర్‌ చేస్తూనే ఉన్నారు. అలాగే  సుష్మిత కూతుర్లు రేనీ, అలీషాలతో తనకున్న ప్రేమ, అనుబంధాలను కూడా రోహ్మాన్‌ తెలుపుతూనే వస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు