Sushmita Sen: బ్రేకప్‌తో ఇంట్లోంచి వెళ్లిపోయిన సుస్మితా బాయ్‌ఫ్రెండ్‌!

23 Dec, 2021 17:19 IST|Sakshi

మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌, బాయ్‌ఫ్రెండ్‌ కశ్మీరి మోడల్‌, బాలీవుడ్‌ నటుడు రోహ్మాన్ షాల్‌తో బ్రేకప్‌ చెప్పుకున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. వయసులో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మన్‌తో గత కొన్నాళ్లుగా డేటింగ్‌ చేస్తూ, లివింగ్‌ రిలేషన్‌షిప్‌‌ను కొనసాగిస్తున్న సుస్మిత తాజాగా ఆ బంధానికి ముగింపు పలికినట్లు ఆంగ్ర పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.

ఇద్దరూ తమ రిలేషన్‌ను బ్రేక్‌ చేసుకోవడంతో రోహ్మాన్‌ సుస్మితా ఇంటి నుంచి కూడా వెళ్లిపోయాడని సమాచారం. ప్రస్తుతం అతడు సన్నిహితుల ఇంట్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సుస్మిత-రోహ్మాన్‌ల మధ్య ఈ ఏడాది నుంచే విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ తమ బంధానికి శాశ్వతంగా ముగింపు పలికినట్లు తెలుస్తుంది.

దీనికి తోడు సుస్మితా వరుస ఇన్‌స్టా పోస్టులు కూడా ఇది నిజమే అన్నట్లు కనిపిస్తున్నాయి. బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ అనంతరం తీవ్ర మనోవేదనతో కుంగిపోతున్న సుస్మితా..బాధ నుంచి బయటపడేందుకు ఇదే సరైన వైద్యం అంటూ జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న ఫోటోలను షేర్‌ చేసుకుంది. దీంతో రోహ్మాన్‌తో బ్రేకప్‌ నిజమేనని బాలీవుడ్‌ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

A post shared by Sushmita Sen (@sushmitasen47)

మరిన్ని వార్తలు