ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చుకున్న నటి.. ధర ఎన్ని కోట్లంటే?

21 Jan, 2023 18:45 IST|Sakshi

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ గురించి బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేదు. గతంలో ఐపీఎల్ ఛైర్మన్‌ లలిత్‌ మోదీతో ప్రేమాయణం సాగించింది. అప్పట్లో సోషల్ మీడియాలో వీరి ఫోటోలు కూడా తెగ వైరలయ్యాయి. సుష్మితా సేన్ 1994లో విశ్వ సుందరి పోటీలో విజేతగా నిలిచింది.  హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది. 

అయితే సుస్మితా సేన్ తాజాగా ఓ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్‌ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తనకు తానే గిఫ్ట్‌ ఇచ్చుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు.  డ్రైవింగ్‌ను ఇష్టపడే మహిళగా ఈ బహుమతి ఇచ్చుకున్నానని సోషల్ మీడియాలో వెల్లడించింది. సుస్మితా సేన్ కొన్న కారు ధర రూ.1.92 కోట్లుగా ఉంది.

సుస్మితా సేన్ ప్రస్తుతం ఆర్య -3 అనే సీరియల్‌లో నటిస్తోంది. రామ్ మాధ్వాని దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో నమిత్ దాస్, మనీష్ చౌదరి, సికందర్ ఖేర్, వినోద్ రావత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు, ఈ షో రెండో సీజన్ డిసెంబర్ 2021లో విడుదలైంది.  మూడో సీజన్ విడుదల తేదీని వెల్లడించలేదు. ఇది కాకుండా, సుస్మిత తాళి అనే కొత్త వెబ్ సిరీస్‌లో నటించనుంది. ట్రాన్స్‌జెండర్ కార్యకర్త గౌరీ సావంత్ పాత్రలో కనిపించనుంది.

మరిన్ని వార్తలు