Sushmita Sen: ట్రాన్స్‌జెండర్‌గా ప్రముఖ బాలీవుడ్‌ నటి

6 Oct, 2022 13:24 IST|Sakshi

బాలీవుడ్‌ పాపులర్‌ నటి సుష్మితా సేన్‌ ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తుంది. 'తాలి' అనే వెబ్‌సిరీస్‌ కోసం ఆమె ప్రముఖ ట్రాన్స్‌జెండర్‌ యాక్టివిస్ట్‌ గౌరీ సావంత్‌ పాత్రను పోషిస్తుంది. తాజాగా ఈ వెబ్‌సిరీస్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో సుష్మితా ఆకుపచ్చని చీరలో నుదిటిపై ఎర్రటి తిలకంతో బోల్డ్‌లుక్‌లో కనిపిస్తుంది. 'అందమైన వ్యక్తి కథను అంతే అందంగా ఈ ప్రపంచంలోకి తీసుకురావడం కన్నా సంతోషం ఏముంటుంది' అంటూ సుష్మితా తాలి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని తన సోషల్‌ మీడియా పంచుకుంది.

కాగా గౌరీ సావంత్‌ ముంబైకి చెందిన ట్రాన్స్‌జెండర్‌ యాక్టివిస్ట్‌. గణేష్‌గా పుట్టి ఆ తర్వాత లింగమార్పిడి చేయించుకున్న గౌరీ సావంత్‌ 2013లో ట్రాన్స్‌జెండర్స్‌ని కూడా పురుషులు, మహిళలు లాగే ఓ ప్రత్యేక క్యాటగిరి కల్పించాలని పిటిషన్‌ దాఖలు చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్స్‌ని థర్డ్‌జెండర్‌గా గుర్తిస్తూ 2014లో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.  

A post shared by Sushmita Sen (@sushmitasen47)

మరిన్ని వార్తలు