అందుకే పెళ్లి చేసుకోలేదు.. నా పిల్లలు కారణం కాదు: స్టార్‌ హీరోయిన్‌

2 Jul, 2022 13:49 IST|Sakshi

Sushmita Sen Says Why She Never Get Married Till Now: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీ చిత్రసీమలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన సుస్మితా 'ఆర్య' వెబ్‌ సిరీస్‌తో మరోసారి తన మార్క్‌ చూపించింది. అంతకుముంచి ఇటీవల కాలంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ వార్తలతో మరింత పాపులర్‌ అయింది. తాజాగా ట్వింకిల్‌ ఖన్నా హోస్ట్ చేస్తున్న 'ట్వీక్‌ ఇండియా: ది ఐకాన్స్‌' కార్యక్రమంలో వివాహ బంధం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది సుస్మితా సేన్. 

'అదృష్టవశాత్తు నేను చాలా ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకున్నాను. కానీ నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోకపోవడానికి ఏకైక కారణం వారు నిరాశ చెందటమే. దీనికి నా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు. నా పిల్లలతో నాకు ఎప్పుడు మంచి సాన్నిహిత్యమే ఉండేది. నా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ముక్తకంఠంతో అంగీకరించారు. ప్రతి ఒక్కరికీ సమానమైన ప్రేమ, గౌరవాన్ని ఇచ్చారు. ఇది చాలా సంతోషమైన విషయం. నిజానికి నేను సుమారు మూడు సార్లు పెళ్లి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మూడు సార్లు వివాహ బంధానికి అతి దగ్గరగా వెళ్లాను. కానీ ఆ దేవుడు నన్ను రక్షించాడు. వారి జీవితంలో జరిగిన విషయాలను నేను మీకు చెప్పలేను. కానీ దేవుడు నన్ను, నా పిల్లలను కాపాడుతున్నాడు. అతను ఎలాంటి చెడు బంధంలోకి వెళ్లనివ్వడు' అని సుస్మితా సేన్‌ తెలిపింది. 

చదవండి: ఫ్రెండ్‌తో బెడ్‌ షేర్‌.. అబార్షన్‌.. ఎలాంటి పశ్చాత్తాపం లేదు: నటి
నగ్నంగా విజయ్‌ దేవరకొండ.. ఫొటో వైరల్‌

సుస్మితా సేన్‌ గతేడాది మోడలైన బాయ్‌ఫ్రెండ్‌ రోహ్‌మాన్‌తో బ్రేకప్ చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సుస్మితా సేన్‌కు ఇద్దరు కుమార్తెలు. 2000 సంవత్సరంలో రెనీని, 2010లో అలీసాను దత్తత తీసుకుంది. 1994లో మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని కైవసం చేసుకున్న సుస్మితా సేన్ 1996లో వచ్చిన 'దస్తక్‌' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత బీవీ నెంబర్‌ 1, డు నాట్‌ డిస్టర్బ్, మై హూ నా, మైనే ప్యార్‌ క్యూ కియా, తుమ్‌కో నా భూల్‌ పాయేంగే, నో ప్రాబ్లమ్‌ వంటి చిత్రాలతో పాటు ఆర్య, ఆర్య 2 వెబ్‌ సిరీస్‌లో నటించి మెప్పించింది. 

చదవండి:  నా రిలేషన్‌ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్‌
తొలిసారిగా మోహన్‌ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్‌..

A post shared by Sushmita Sen (@sushmitasen47)

మరిన్ని వార్తలు