Farah Khan Ali: విడాకులు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది: ఫరా ఖాన్ ‍అలీ

10 Feb, 2023 19:22 IST|Sakshi

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ భార్య సుసానే ఖాన్ సోదరి ఫరా ఖాన్ అలీ విడాకులు తీసింది. తన భర్త డీజే అకీల్‌తో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు తెలిపింది. కాగా.. 2021లోనే తామిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.  జువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీ భర్త అకీల్‌తో  ఉన్న చిత్రాలను పోస్ట్ చేసింది.

ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మేము అధికారికంగా విడాకులు తీసుకున్నాం. ఈ విషయంలో మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. మేము ఒకరికొకరు చాలా ప్రేమ, సంతోషంతో ఉన్నాం. ఇకముందు ప్రయాణంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఎల్లప్పుడూ మా  పిల్లలు అజాన్, ఫిజాలకు తల్లిదండ్రులుగానే ఉంటాం. ఇన్ని రోజుల మా ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. 

ఇదే విషయాన్ని అకీల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. మీ ఇద్దర్నీ ప్రేమిస్తూనే ఉంటా సుసానే ఖాన్ కామెంట్ చేసింది. ఈ విడాకులు తీసుకున్న జంటపై బాలీవుడ్ నటులు ట్వింకిల్ ఖన్నా, నందితా మహతాని, సైషా షిండే, దియా మీర్జా, భావన పాండే, మోజెజ్ సింగ్, ఎల్నాజ్ నొరౌజీ  తదితరులు స్పందించారు.  ఫరా, అకీల్ కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఫిబ్రవరి 20, 1999న పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు అజాన్, ఫిజా ఉన్నారు. 

A post shared by Farah Khan Ali (@farahkhanali)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు