Suzhal The Vortex: 16 ఏళ్ల తర్వాత వెబ్‌సిరీస్‌తో నటి రీ ఎంట్రీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

12 Jun, 2022 15:24 IST|Sakshi

సుడల్‌: ది వొర్టెక్స్‌ వెబ్‌ సిరీస్‌ 30 భాషలలో ఈ నెల 17వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. పార్తీవన్‌, కదీర్‌, ఐశ్వర్య రాజేష్‌, శ్రేయారెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను విక్రమ్‌ వేదా చిత్రం ఫేమ్‌ గాయత్రి పుష్కర్‌ల ద్వయం నిర్మించింది. బ్రహ్మ, అనుచరణ్‌ల ద్వయం దర్శకత్వం వహించారు. 16 ఏళ్ల గ్యాప్‌ తర్వాత నటి శ్రేయారెడ్డి ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా రీఎంట్రీ ఇవ్వనుండటం విశేషం. ఇందులో రెజీనా అనే పోలీసు అధికారిగా ఛాలెంజ్‌ పాత్రలో నటించినట్లు ఆమె తెలిపారు.

తాను ఇప్పటివరకు 30 చిత్రాలకు పైగా నటించానని, ఈ వెబ్‌ సిరీస్‌లో నటించినప్పుడు కలిగిన సౌకర్యం, వసతి ఇంతకు ముందెప్పుడూ కలగలేదని ఐశ్వర్య రాజేష్‌ పేర్కొన్నారు. నందిని అనే యువతిగా బలమైన పాత్రను ఇందులో పోషించినట్లు చెప్పారు. ఈ చిత్రం యాక్షన్‌, థ్రిల్లర్‌ కథా చిత్రంగా రూపొందిన చిత్రమన్నారు. తన 32 ఏళ్ల సినీ జీవితంలో సౌకర్యంగా నటించానంటే అది ఈ వెబ్‌సిరీస్‌లోనే అని నటుడు పార్తీపన్‌ అన్నారు.

చదవండి: ఆ హీరో నన్ను అలా పిలవడం ఇష్టం లేదు
నా సినిమా ఫ్లాప్‌ అయినా కూడా రానా బాగుందనేవాడు

మరిన్ని వార్తలు