ప్రతిభ ఉన్న బాల నటులకు చక్కని వేదిక: ఎస్వీకృష్ణారెడ్డి

10 Apr, 2021 21:09 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రస్తుతం టాలీవుడ్‌లో న్యూ టాలెంట్‌కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, అలాగే మంచి ప్రతిభ కలిగిన నటులను పరిచయం చేసేందుకు చక్కని వేదికలు కూడా అందుబాటులోకి వచ్చాయని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం (ఏప్రిల్‌ 11, 2021) నుంచి ప్రారంభం కానున్న జీ తెలుగు డ్రామా జూనియర్స్‌ ది నెక్ట్స్‌ సూపర్‌స్టార్‌ 5వ ఎడిషన్‌కు ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకుంటూ...గత కొన్ని ఎడిషన్ల ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన బాల నటులు ప్రస్తుతం మంచి కెరీర్‌ను అందుకుంటూ నటనలో రాణిస్తున్నారని చెప్పారు. మరింత మంది ప్రతిభావంతుల అభినయాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులతో సహా తానూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు. 
జడ్జిల ప్యానెల్‌లో రేణూ దేశాయ్, సునీత...
ఇటీవలే తన పెళ్లి ద్వారా టాక్‌ ఆఫ్‌ ద మీడియా గా మారిన ప్రముఖ గాయని సునీత డ్రామా జూనియర్స్‌లో మరో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అలాగే సినీనటి, నిర్మాత రేణూదేశాయ్‌ సైతం జడ్జిల ప్యానెల్‌లో ఉన్నారు. ఈ కార్యోక్రమం ప్రతి ఆదివారం రాత్రి 8గంటల నుంచి ప్రసారం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభినయ కౌశల్యాన్ని ప్రదర్శించనున్నారు.

( చదవండి: కంగనాకి అక్షయ్‌ కుమార్‌ సీక్రెట్‌ కాల్‌! )

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు