Mahesh Babu: అక్కడికి ఎందుకు వెళ్లాలి? బాలీవుడ్‌పై మహేశ్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు

11 May, 2022 12:50 IST|Sakshi

బాలీవుడ్‌పై మహేశ్‌బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఆయన ఓ ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతూ..  తనను భరించడం బాలీవుడ్‌కు కష్టమని, అందుకే, తన సమయాన్ని వృథా చేసుకోవాలని అనుకోవట్లేదని ఆయన అన్నారు. దీంతో మహేశ్‌ అంత భారీగా రెమ్యునరేషన్‌ తీసుకుంటారా? అనే కథనాలు హిందీ మీడియాలో వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన వ్యాఖ్యలపై మహేశ్‌ బాబు వివరణ ఇచ్చారు. ఆయన నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. 

(చదవండి:  సీఎం జగన్‌తో గడిపిన సమయం గుర్తుండిపోతుంది: మహేశ్‌బాబు)

ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన తెలుగు మీడియాతో ముచ్చటించారు. బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్‌ గురించి ఓ విలేకరి ప్రశ్నించగా...మహేశ్‌ తనదైన శైలీలో సమాధానం ఇచ్చాడు. ‘బాలీవుడ్‌పై నేను ఎప్పుడు నెగెటివ్‌ కామెంట్స్‌ చేయలేదు. నేను అన్ని భాషలను గౌరవిస్తాను. బాలీవుడ్‌ సినిమాలు చేయనని చెప్పలేదు..నేను ఎప్పుడు తెలుగు సినిమాలే చేస్తానని చెప్పాను.

మన తెలుగు సినిమాలు బాలీవుడ్‌కి రీచ్‌ అవ్వాలనేదే నా కోరిక. నేను పదేళ్ల నుంచి అనుకున్నది ఇప్పుడు నెరవేరుతుంది. మన తెలుగు సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. మన ఇండస్ట్రీని వదిలేసి అక్కడికి ఎందుకు వెళ్లాలి అనేదే నా ఫీలింగ్. నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. అక్కడికి వెళ్లే ఆలోచనలేదు’ అని మహేశ్‌ చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు