Hyderabad Police: ఎస్వీపీ ట్రైలర్​ రిలీజ్.. ఆ సీన్​తో ప్రజలకు అవగాహన

3 May, 2022 07:57 IST|Sakshi

SVP Trailer: Hyderabad Police Awareness With Helmet Scene: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మహానటి కీర్తి సురేష్​ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇటీవల విడుదలైన పెన్నీ, కళావతి, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్​ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్​లోని సీన్లు, డైలాగ్​లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఈ ట్రైలర్​లోని సీన్లు ప్రేక్షకులనే కాకుండా హైదరాబాద్​ సిటీ పోలీసులను సైతం బాగా ఆకర్షించాయి. ఈ మూవీ ప్రచార చిత్రంలో ఓ సన్నివేశంలో విలన్​కు హెల్మెట్​ పెడుతూ డైలాగ్​ చెప్తాడు మహేశ్​ బాబు. ఈ సీన్​ను హైదరాబాద్​ సిటీ పోలీస్​ ట్విటర్ అకౌంట్​ నిర్వాహకులు బాగా వాడారు. మూవీలోని ఈ సీన్​కు క్రెడిట్​ ఇస్తూ హెల్మెట్​ ధరించండి, భద్రత ముఖ్యం అంటూ ట్వీట్​ చేశారు. సాధారణంగానే బాగా వైరల్​ అయిన సీన్లు, సాంగ్స్​, హుక్​ స్టెప్స్​లను మార్ఫింగ్​ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్​ పోలీసులు. ఇక ట్రైలర్​లోనే హెల్మెట్​ ధరించడం ఉండేసరికి వీడియో పోస్ట్​ చేస్తూ కొటేషన్స్​తో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

చదవండి: థియేటర్​లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్​చల్​.. అద్దాలు ధ్వంసం
మహేశ్​బాబు నోట ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మాట

మరిన్ని వార్తలు