నేనెప్పుడూ డ్ర‌గ్స్ తీసుకోలేదు: స్వ‌స్తిక

20 Aug, 2020 17:30 IST|Sakshi

ముంబై: త‌న‌కు క్యాన్స‌ర్ అంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై బాలీవుడ్‌ న‌టి స్వ‌స్తిక ముఖ‌ర్జీ స్పందించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా క్యాన్స‌ర్ రూమ‌ర్స్‌కు చెక్ పెట్టారు. కొత్త హెయిర్‌స్టైల్‌ చేయించుకున్న ఫొటోను ఇటీవల సోష‌ల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఫొటోలో ఆమె స‌గం గుండుతో, మ‌రో సగం ముఖంపై వాలి ఉన్న జుట్టుతో క‌నిపించారు. దీంతో స్వ‌స్తిక‌కు క్యాన్స‌ర్ వ‌చ్చిందంటూ ప‌లు ఊహాగానాలు తెర‌పైకి వ‌చ్చాయి. ‘నాకు క్యాన్స‌ర్ రాలేదు (ఎప్పుడూ రాకూడ‌ద‌ని ప్రార్థిస్తున్నాను) నేనెప్పుడూ డ్ర‌గ్స్ తీసుకోలేదు. క‌నీసం సిగ‌రెట్ కూడా కాల్చ‌ను. ఇంత‌వ‌ర‌కూ పునరావాస కేంద్రానికి వెళ్లా‍ల్సిన అవసరం రాలేదు. నా జుట్టు కాబ‌ట్టి నాకు ఏం చేయాల‌నిపిస్తే అది చేస్తా. ఇక మీ అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చా అనుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు. (ఇంటికే వస్తున్నా: హీరో నాని)

న‌టి స్వ‌స్తికా ముఖ‌ర్జీకి ప‌లువురు న‌టీన‌టులు మ‌ద్ద‌తు తెలుపుతూ ట్వీట్ చేస్తున్నారు. ఇటీవ‌ల న‌టి స్వ‌స్తిక సోష‌ల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టుకు మీరు అస్స‌లు బాలేరు బ‌హుశా  ఫిల్ట‌ర్, మేక‌ప్ చేయ‌లేద‌న‌కుంటా అని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్ట‌గా స్వ‌స్తిక గ‌ట్టి కౌంట‌రే ఇచ్చారు. బాలేక‌పోతేనేం చీర్స్ అంటూ స్వీట్‌గా బ‌దులిచ్చారు. బెంగాలీ సీరియ‌ల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న స్వ‌స్తిక చివ‌రిసారిగా దిల్ బెచారా చిత్రంలో న‌టించింది. సుశాంత్ ప్రియురాలు సంజ‌న సంఘికి త‌ల్లిగా న‌టించి మెప్పించింది. సుశాంత్ మ‌ర‌ణంపై సీబీఐ విచార‌ణ‌కు అనుకూలంగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తూ ట్వీట్ చేసింది. (ఎందుకీ మౌనం?: క‌ంగ‌నా)

మరిన్ని వార్తలు