అందరి ముందు కన్నీరు పెట్టుకున్న ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్

1 Aug, 2023 08:30 IST|Sakshi

‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.  రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోంది. 

(ఇదీ చదవండి: యంగ్‌ హీరోపై బాహుబలి నిర్మాత శోభు సంచలన వ్యాఖ్యలు)

హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్‌ కూడా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోహైల్‌తో పాటు దీప్తి నల్లమోతు,రూపా,అలీ రెజా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ సోహైల్‌ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యాడు. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా సమయంలో చాలా మంది అవమానించారని ఆయన కన్నీరు పెట్టుకున్నాడు.

(ఇదీ చదవండి: రూ. 500 కోట్లు అయినా సరే నచ్చకపోతే నో చెప్పేస్తా: హీరోయిన్‌)

ఇక్కడ లైఫ్‌లో ముందుకెళ్లాలి.. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా..? వీడు రియాల్టీ షో నుంచి వచ్చాడు, చిన్న స్క్రీన్ నుంచి వచ్చాడు అని అంటూ ఉంటే ఒక్కోసారి భయమేస్తూ ఉంటుందని ఆయన ఎమోషనల్‌ అయ్యాడు. ఈ సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు కొందరు నెగిటివ్‌ కామెంట్లు చేశారు. తర్వాత ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ఏందిరా ఈ తేడా గాడు.. అది ఇది అంటూ హేళన చేశారని ఆయన స్టేజీపైనే అందరి ముందు కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో ఆయన్ను అభిమానించే వారు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

మరిన్ని వార్తలు