సోహైల్‌ సినిమా: హీరోయిన్‌గా డాక్టరమ్మ‌!

29 Mar, 2021 20:41 IST|Sakshi

ఇస్మార్ట్‌ సోహైల్‌.. ఇప్పుడీ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో అడుగు పెట్టిన అతడు తన యాటిట్యూడ్‌, ఫ్రెండ్‌షిప్‌తో ఎంతో మంది మనసులను దోచుకున్నాడు. అదే సమయంలో తన కోపంతో తోటి కంటెస్టెంట్లతో గొడవ పెట్టుకుని వ్యాఖ్యాత నాగార్జున చేత చీవాట్లు తిన్నాడు. దీంతో తను కోపాన్ని వదిలేస్తానని నాగ్‌కు మాటిచ్చి, అదే మాట మీద షో ఎండింగ్‌ వరకు నిలబడి సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు.

ఇక బిగ్‌బాస్‌ నుంచి వచ్చిన కొన్ని రోజులకే హీరోగా తన తొలి సినిమాను ప్రకటించాడు సోహైల్‌. శ్రీనివాస్‌ వింజనంపతి దీన్ని డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఆ మధ్యే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది. తాజాగా హోలీ పండగను పురస్కరించుకుని సోహైల్‌ సరసన నటిస్తున్న హీరోయిన్‌ పేరును ప్రకటించారు. 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య'లో నటించిన నేచురల్‌ బ్యూటీ రూప కొడువాయర్‌ సోహైల్‌తో జోడీ కడుతున్నట్లు పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. హీరోహీరోయిన్లు రొమాంటిక్‌గా పోజిచ్చిన ఈ పోస్టర్‌ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ హీరోయిన్‌ రూప నిజ జీవితంలో డాక్టర్‌ కావడం విశేషం. జార్జి రెడ్డి, ప్రెష‌ర్ కుక్క‌ర్ చిత్ర నిర్మాత‌లు అప్పిరెడ్డి, స‌జ్జ‌ల ర‌విరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official)

ఇక పైసా పారితోషికం తీసుకోకుండా సోహైల్‌ సినిమాలో నటిస్తానని ఆ మధ్య బ్రహ్మానందం మాటిచ్చాడు. అలాగే చిరంజీవి కూడా అతడి సినిమాలో చిన్న పాత్ర చేస్తానని చెప్పాడు. మరి వీళ్లిద్దరూ ఈ సినిమాలో కనిపిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

చదవండి: కొత్త కారు కొన్న సోహెల్‌.. క‌థ వేరుంటద‌ని పోస్ట్‌

రాత్రి నడిరోడ్డు మీద కారు ఆపేసిన సన్నీలియోన్‌ భర్త

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు